
అందుబాటులో ఎనిమిది వేల టన్నుల యూరియా
మేళ్లచెరువు : జిల్లాలో ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) గోగుల శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం చింతలపాలెం మండల కేంద్రంతో పాటు దొండపాడులోని ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రైతుల నానో యూనియా వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు. డీఏఓ వెంట మండల వ్యవసాయాధికారి శశాంక్, ఎరువుల డీలర్లు తదితరులు ఉన్నారు.