ఇన్నోవేషన్‌ హబ్‌.. మనకేనా? | - | Sakshi
Sakshi News home page

ఇన్నోవేషన్‌ హబ్‌.. మనకేనా?

Aug 8 2025 9:09 AM | Updated on Aug 8 2025 9:09 AM

ఇన్నో

ఇన్నోవేషన్‌ హబ్‌.. మనకేనా?

దక్షిణ తెలంగాణలో రీజనల్‌ హబ్‌ ఏర్పాటు దిశగా కేంద్రం

స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

లక్ష్యంగా..

రీజనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కేంద్రం భావిస్తోంది. పరిశోధన – అభివృద్ధి కేంద్రాల్లో ఉద్యోగాలు, నూతన సాంకేతికతలపై పరిశోధనలో పాలుపంచుకునే అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్‌లకు సహకారం అందించడం, ఫండింగ్‌, మార్కెట్‌ లింకేజీలో సహకారం అందించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటును అందించనుంది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దక్షిణ తెలంగాణలో రీజనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ లేదా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని వెల్లడించింది. అంతేకాదు నల్లగొండలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి పార్లమెంటులో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్‌ హబ్‌ను నల్లగొండలోనే ఏర్పాటు చేసేలా ఎంపీ కేంద్రాన్ని కోరారు. దీంతో జిల్లాలో హబ్‌ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం

వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలు, పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రీజనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌లను/సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, చైన్నె తదితర ప్రాంతాల్లో ఇన్నోవేషన్‌ హబ్‌లు ఉన్నాయి. అవికాకుండా ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో రీజనల్‌ హబ్‌ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణలో ఒకటి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ రఘువీర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ హబ్‌ నల్లగొండకు మంజూరు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది దానిపైనా అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చించనున్నారు.

ఫ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలకం

ఫ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు

ఫ పార్లమెంటు ప్రశ్నత్తరాల్లో

ఎంపీ రఘువీర్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం

ఇన్నోవేషన్‌ హబ్‌.. మనకేనా?1
1/1

ఇన్నోవేషన్‌ హబ్‌.. మనకేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement