
ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగుల నివారణ
భానుపురి (సూర్యాపేట) : ఆల్బెండ జోల్ మాత్రలతో పిల్లల్లో నులిపురుగులను నివారించవచ్చని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ సంవత్సరం ఆగస్టు 11 న జాతీయ డీవార్మింగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ సమాచారాన్ని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నిరుద్యోగ యువత తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లా అధికారులు తమశాఖ అభివృద్ధి పనులపై, తమకు కేటాయించిన హాస్టళ్లు, పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్