
రాజ్యాధికారం సాధించడమే ధ్యేయం
తిరుమలగిరి( తుంగతుర్తి) : బీసీ వర్గంలోని అన్ని కులాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే మన ఆలోచన సాధన సమితి ధ్యేయమని ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు అన్నారు. బీసీల చైతన్యం గ్రామ బాట కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరిలో ఆదివారం మన ఆలోచన సాధన సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు చిత్తశుద్ధితో తొమ్మిదో షెడ్యూల్ సవరణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, మన ఆలోచన సాధన సమితి నాయకులు గిలకత్తుల రాముగౌడ్, చేను శ్రీనివాస్, కందుకూరి ప్రవీణ్, తన్నీరు రాంప్రభు, కడెం లింగయ్య, పులిమామిడి సోమయ్య, భిక్షం, ఆలేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలి
సూర్యాపేట అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సర్వే నిర్వహించి మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టిపె ల్లి సైదులు, కోట గోపి, ఏకలక్ష్మి పాల్గొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం
సూర్యాపేట : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై కట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను ఎడారిగా మార్చే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్‌రావు కేంద్రానికి లేఖ రాశాడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించి మేమున్నామని ప్రగల్బాలు పలుకుతోందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు కడితే నల్లగొండ, మహబూబ్‌నగర్‌తోపాటు సూర్యాపేట జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు ఎడారిగా మారుతాయన్నారు.

రాజ్యాధికారం సాధించడమే ధ్యేయం