
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో నిర్వహించిన పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజుల నియంత్రణకు చట్టం లేకపోవడం వల్ల, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం 7 శాతం మించి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల విద్యారంగం వెనుకబడుతోందన్నారు. క్రార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్, నవీన్, నితిన్, పవన్, మనీషా, విజయ్, వాజిద్, మహ్మద్ ఆలీ, సైదా, శృతి తదితరులు పాల్గొన్నారు.
ఫ పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి