పదిలంగా స్నేహబంధం | - | Sakshi
Sakshi News home page

పదిలంగా స్నేహబంధం

Aug 3 2025 2:53 AM | Updated on Aug 3 2025 2:53 AM

పదిలం

పదిలంగా స్నేహబంధం

స్నేహమేరా జీవితం

స్నేహానికి కల్మషం లేదంటున్న యువత

అమ్మ తరువాత స్థానంలో స్నేహితుడు, నాన్న

సుఖ దుఃఖాల్లో, కష్ట సుఖాల్లో వెన్నంటి ఉంటూ తాను తోడున్నాననే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. అన్ని సమయాల్లో నిస్వార్థంతో ఉండే అనురాగబంధమే స్నేహం. అందుకే స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడో సినీ కవి. ఆధునిక పోకడలు మనిషి జీవితాన్ని మార్చేసిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ స్నేహానికి ఉన్న స్థానం అలాగే పదిలంగా ఉంది. మనిషిలో ఎన్ని మార్పులొచ్చినా స్నేహానికి ఉన్న విలువ ఏ మాత్రం తగ్గలేదు. అయితే మనుషులు కలుషితం అయ్యారే తప్ప స్నేహానికి ఉన్న స్థానం గొప్పదనే చెబుతోంది నేటి యువత. అలాంటి మనుషుల వల్ల కొంతవరకు స్నేహం కలుషితం అయింది తప్ప, స్నేహం అనేది కల్మషం లేనిదంటూ స్పష్టం చేశారు. ఈనెల 3వ తేదీన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి 100 మందిని ‘సాక్షి’ పలకరించింది. అందులో ప్రతి ఒక్కరూ తమ దృష్టిలో స్నేహం కల్మషం లేనిదని చెప్పుకొచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1200 మందితో సర్వే నిర్వహించగా, అందులో 72.42 శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 27.58 శాతం అవసరాలు తీర్చేదిగా స్నేహం మారిందని పేర్కొన్నారు. మనుషుల స్వార్థం కారణంగా స్నేహం కూడా కలుషితం అయిందని 57.08 శాతం మంది వెల్లడించగా, కలుషితం కాలేదని 42.92 శాతం మంది తెలిపారు. తమకు ఒక్కరే స్నేహితులు ఉన్నారని 37.50 శాతం మంది పేర్కొనగా, తమకు ఇద్దరిక కంటే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని 62.50 శాతం మంది స్పష్టం చేశారు. స్నేహితునికి ఇచ్చే స్థానం విషయంలోనూ అమ్మ, నాన్న కంటే ముందుగా స్నేహితునికే మొదటి స్థానం ఇస్తామని 21.42 శాతం మంది స్పష్టం చేశారు. 62.25 శాతం మంది.. అమ్మకే మొదటి స్థానాన్ని ఇవ్వగా, రెండో స్థానాన్ని స్నేహితునికి ఇచ్చారు. 16.33 శాతం మంది మాత్రం మొదటి స్థానం నాన్నకు ఇవ్వగా, ఆ తరువాత అమ్మ, స్నేహితునికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చారు.

ప్రత్యేక కథనాలు

8లోu

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:

పదిలంగా స్నేహబంధం1
1/1

పదిలంగా స్నేహబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement