
జీపీఓ పోస్టుకు ఓకే!
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పాలనాధికారి (జీపీఓ) పోస్టుల్లో చేరేందుకు పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా విధుల్లోకి చేరగానే పాత సర్వీస్ ఉండదని, జీరో నుంచి సర్వీస్ అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా పేర్కొన్నా దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంపిక కోసం రెండు విడతల్లో నిర్వహించిన అర్హత పరీక్షకు 94.18 మంది హాజరుకావడమే ఇందుకు నిదర్శనం
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి..
పల్లెల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా గ్రామ పాలనాధికారి పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల నుంచి వారి విద్యార్హతల ఆధారంగా గ్రామ పాలనాధికారి పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే కొత్తగా విధుల్లోకి చేరగానే పాత సర్వీస్ ఉండదని, జీరో నుంచి మొదలవుతుందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత అర్హులైన 275మంది పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు దరఖాస్తు చేసుకున్నారు. అంటే మొదటి విడతలో ఈ ఏడాది మే 25న నిర్వహించిన పరీక్షకు 194 మంది అర్హులకు గాను 182 మంది హాజరయ్యారు. రెండో విడతలో జూలై 27న నిర్వహించిన పరీక్షను 81 మందికి గాను 77 మంది రాశారు. రెండు విడతల్లో కలిపి 259 మంది పరీక్షకు హాజరయ్యారు. కేవలం 16 మంది మాత్రమే గైర్హాజరు కావడంతో జీపీఓ పోస్టుల్లో చేరేందుకు అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో..
వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల వ్యవస్థను గత ప్రభుత్వ హయాంలో రద్దుచేశారు. అయితే జిల్లాలో పూర్వ వీఆర్‌ఓలు 209 మంది, వీఆర్‌ఏలు 440 మంది ఉండగా అప్పట్లో వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా భర్తీ చేస్తున్న గ్రామపాలనాధికారి పోస్టుల్లోకి వచ్చేందుకు వారికి అవకాశం కల్పించింది.
ఫ గ్రామ పాలనాధికారిగా చేయడానికి పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల ఆసక్తి
ఫ దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు
ఇప్పటికే రెండు విడతలుగా పరీక్ష
ఫ 275 మందికి గాను 259 మంది పరీక్షకు హాజరు
ఫ జీరో సర్వీస్ నిబంధనను పట్టించుకోని అభ్యర్థులు
ఫ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అధికారుల సన్నాహాలు