
నేడు నీట్ పీజీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పీజీ(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్‌గ్రాడ్యుయేట్)కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని కోసం రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12.30గంటల వరకు పరీక్ష జరగనుంది. మొ 230 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిలో సూర్యాపేట ఎస్‌వీ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో 180 మంది, కోదాడలోని సనా ఇంజనీరింగ్ కళాశాలలో 50 మంది పరీక్ష రాయనున్నారు.
ఉదయం 8.30గంటల వరకు అనుమతి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ .. అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉదయం 7 నుంచి 8.30 వరకు పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత ప్రధాన గేటు మూసి వేస్తామన్నారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జయలత, తహసీల్దార్ కృష్ణయ్య, తదితరులు ఉన్నారు.
అభ్యర్థులకు సూచనలు..
ఫ ఒరిజినల్ అడ్మిట్ కార్డు( ప్రింటెడ్ ఫొటో తో కూడినది), ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (ఓటర్ ఐడీ , పాన్ కార్డ్ ,డ్రైవింగ్ లైసెన్స్ ,ఆధార్, ఈ– ఆధార్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు) లలో ఏదో ఒకటి తప్పనిసరి.
ఫ ఫొటో గుర్తింపునకు సంబంధించి జిరాక్స్ కాపీలు లేదా మొబైల్ లో ఉండే గుర్తింపు కార్డులను అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
ఫ అభ్యర్థులు టీషర్ట్స్, షాట్స్ వంటి దుస్తులు కాకుండా సాధారణ దుస్తులను ధరించి రావాలి.
ఫ ఉదయం 9 నుంచి
12.30 గంటల వరకు పరీక్ష
ఫ రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
ఫ హాజరుకానున్న 230 మంది అభ్యర్థులు
ఫ సూర్యాపేటలో పరీక్ష కేంద్రాన్ని
పరిశీలించిన కలెక్టర్