సివిల్ కోర్ట్ జడ్జిగా గౌస్‌పాష బాధ్యతల స్వీకరణ
తుంగతుర్తి : తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా ఎం.డి. గౌస్ పాష గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టుల పట్ల కక్షిదారులకు విశ్వాసం పెంచుతామన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞాన సుందర్ బార్ అసోసియేషన్ సభ్యుడు జడ్జి గౌస్ పాష కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్ఞాన సుందర్ మాట్లాడుతూ కోర్టు భవనానికి ప్రభుత్వం మూడు ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించిందన్నారు. భవన నిర్మాణానికి రూ.29 కోట్లను అధికారులు అంచనా వేశారన్నారు. త్వరలో అడిషనల్ కోర్టు మంజూరుకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎంను కలుస్తానని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కారింగుల వెంకటేశ్వర్లు ,ప్రధాన కార్యదర్శి కారింగుల వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ రవికుమార్ ,ట్రెజరర్ సతీష్ ,ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రతాప్ ,సీనియర్ న్యాయవాది కుమారస్వామి, హరిచరణ్, చంద్రమౌళి ,అనిల్ పాల్గొన్నారు.


