ప్రతిభ చాటి.. పతకాలు సాధించి
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండల గురుకుల పాఠశాల విద్యార్థులు చిత్రలేఖనంలో సత్తా చాటారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆర్ట్ నేషనల్ లెవెవల్ కాంపిటీషన్ పోటీల్లో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల జోనల్ అధికారి విద్యారాణి చేతుల మీదుగా బహుమతులు స్వీకరించారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం పోటీలు నిర్వహించగా 12 కేటగిరీల్లో 16 అవార్డులు దక్కించుకున్నారు. అదే విధంగా పాఠశాలకు ఆర్ట్ ఆఫ్ ఇండియా గ్లోబల్, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, ఆర్ట్ ఉపాధ్యాయుడు చింతల పాటి ప్రవీణ్‌కుమార్‌కు కళా తపస్వి అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వర్లు, బి.రమేష్. జూనియర్ లెక్చరర్ యాదయ్య, పీడీ క్రిష్ణారెడ్డి, పీఈటీ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.


