‘పేట’లో యూజీడీ కొన్ని ప్రాంతాల్లోనే..
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో పట్టణం మొత్తం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) నిర్మించాలన్న ప్రణాళిక ఉంది. కానీ, కొన్ని చోట్లనే నిర్మిస్తున్నారు. ఓపెన్ డ్రైనేజీలు శిథిలావస్థకు చేరాయి. వాటి నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. దుర్వాసన, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం మురుగు నీరంతా రోడ్లపైకి వస్తుండటంతో నడవలేని పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాళాలు ఆక్రమణకు గురై చిన్నవిగా మారడంతో వర్షాకాలంలో నాలాల పొంగి ఆర్కే గార్డెన్, ఎస్వీ కాలేజీ వెనుక వైపు ఉన్న పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. అధికారులు తరచూ వెళ్లి చూడడమే తప్ప సమస్యకు పరిష్కారం చూపడం లేదు.
‘పేట’లో యూజీడీ కొన్ని ప్రాంతాల్లోనే..


