బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద విద్యార్థులచే బాల్య వి వా హాల వల్ల జరిగే అనర్థాలపై నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.యుక్త వయస్సు వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నాగూరి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్


