చైనా మాంజాలకు ఏదీ చెక్...
సూర్యాపేట టౌన్ : సంక్రాంతి పండుగ ప్రత్యేకతల్లో పతంగులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చిన్నలతో పాటు పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే గాలిపటాలను ఎగురవేసేందుకు సంప్రదాయ దారానికి బదులు.. రసాయనాలతో తయారు చేసి చైనా దారాన్ని (మాంజా) ఉపయోగిస్తుంటారు. మాంజాపై నిషేధించినప్పటికీ కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.
ప్రమాదకర రసాయనాల వినియోగం
చైనా మాంజాల్లో ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తుంటారు. గాజుపొడి, అల్యూమినియం ఆకై ్సడ్ కలుపుతారు. దారం తెగకుండా గట్టిగా ఉండేందుకు వివిధ రంగుల మిశ్రమంతో సింథటిక్ ఫైబర్ వినియోగిస్తున్నారు. మాంజా వల్ల మనుషులతో పాటు పశుపక్ష్యాధులకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పతంగులను ఎగురవేస్తుండగా కొన్నిసార్లు తెగిపోయి చెట్లు, అపార్ట్‌మెంట్లకు చిక్కుకుని గాలికి వేలాడుతుంటాయి. ఆ మార్గంలో ద్విచక్ర వాహనదారులు వెళ్లినప్పుడు వారి మెడకు చిక్కుకొని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలున్నాయి. పక్షులు కూడా వాటికి చిక్కుకొని చనిపోతున్నాయి. అంతేకాకుండా మాంజా దారం నీరు, భూమిలో కరగదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2016లో చైనా మాంజా వాడకాన్ని నిషేధించింది.
ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి
చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. సూర్యాపేట తదితర పట్టణాల్లో కొందరు వ్యాపారులు రహస్య ప్రాంతాల్లో మాంజాలను ఉంచి విక్రయిస్తున్నట్టు సమాచారం. రెండు రోజుల్లో పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. యువకులు, చిన్నారులు గాలిపటాలు ఎగురవేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రజల భద్రత, ఇతర ప్రాణుల రక్షణ దృష్ట్యా చైనా మాంజాపై నిషేధం ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు చైనా మంజా కొనియ్యొద్దు. సంక్రాంతి పండుగ వేళ జిల్లాలో చైనా మాంజాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే జైలు శిక్ష తప్పదు. చైనా మాంజా విక్రయం, వినియోగంపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఉంచి రౌండ్స్ నిర్వహిస్తున్నాం. ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712686057, 8712686026 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. – నరసింహ, ఎస్పీ, సూర్యాపేట
పతంగులు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యుత్ శాఖ విడుదల చేసిన కార్టూన్లు
ఫ నిషేధం ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు
ఫ సంక్రాంతి వేళ పిల్లలు, పెద్దలు
గాలిపటాలు ఎగురవేసేందుకు ఆసక్తి
ఫ మాంజాలతో పొంచి ఉన్న ముప్పు
చైనా మాంజాలకు ఏదీ చెక్...


