జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదకు సన్మానం
చివ్వెంల: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ శారదను శుక్రవారం సూర్యాపేటలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఎక్స్ అఫీషియో సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మొక్కను అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ఎక్స్‌అఫీషియో సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, నల్లపాటి మమత తదితరుల పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
భానుపురి (సూర్యాపేట): ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కోదాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో ఫౌండేషన్ లీటరసీ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్)పై నిర్వహించినసమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రతిరోజూ విద్యార్థులకు తెలుగు రాయడం, చదవడం నేర్పించడానికి సమయం కేటాయిస్తూ నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. అర్థంకాని విద్యార్థులకు వీడియోల ద్వారా తెలుగు, హిందీ భాషలు నేర్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ అశోక్, క్వాలిటీ కోఆర్డినేటర్ జనార్దన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రవణ్‌కుమార్, ఇంక్లూజివ్ కోఆర్డినేటర్ రాంబాబు, జనరల్ ఈక్వలిటీ కోఆర్డినేటర్ పూలమ్మ పాల్గొన్నారు.
నేరాలకు పాల్పడితే ఏనాటికై నా శిక్ష తప్పదు
సూర్యాపేటటౌన్ : చట్టాన్ని ఉల్లంఘిస్తూ నేరాలకు పాల్పడితే ఏనాటికై నా శిక్ష తప్పదని ఎస్పీ కె.నరసింహ అన్నారు. కన్న కూతురిని నరబలి ఇవ్వగా తల్లికి ఉరిశిక్ష విధించిన కేసులో బాధితుల తరఫున వాదనలు వినిపించిన జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవిందర్‌ను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు పోలీస్ లైజన్ అధికారి హెడ్ కానిస్టేబుల్ గంపల శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.
పెండింగ్ బిల్లులు
విడుదల చేయాలి
సూర్యాపేట అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని నిర్వహించి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో ఆ జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, అడిషనల్ జనరల్ సెక్రెటరీ తంగెళ్ల జితేందర్‌రెడ్డి, ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ పాండు నాయక్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ దున్న శ్యామ్, కో చైర్మన్లు వీరన్న, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లక్కపాక ప్రవీణ్, జహంగీర్, జాయింట్ సెక్రెటరీ డి.స్వప్న, సీటీఓ విభాగం చైర్మన్ రవీందర్ బాబు, నాయిని ఆకాష్ వర్మ, ఎం.సైదులు, వెంకన్న, సతీష్, రవి, మల్సూర్ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదకు సన్మానం


