నేడు ఉత్తమ్ పర్యటన
● అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న మంత్రి
కోదాడరూరల్ : కోదాడ నియోజకవర్గం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. చిలుకూరు మండలంలోని నారాయణపురం, కోదాడ మండలంలోని తొగర్రాయి, కూచిపూడిలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాన చేయనున్నారు. ఆతర్వాత కోదాడ పట్టణంలో 100 పడకల వైద్యశాల భవన నిర్మాణ పనులు, జ్యోతిబాఫూలే విగ్రహాన్ని, బాలాజీ నగర్‌లో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించనున్నారు.
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రస్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో మొత్తం 93 దరఖాస్తులు అందజేశారన్నారు. భారతి రంగా ఆర్గనైజేషన్ ఫర్ వెల్ఫేర్ సొసైటీ జిల్లాలోని 700 మంది టీబీ పేషెంట్లకు 3,000 న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అదనపు కలెక్టర్ రాంబాబు చేతుల మీదుగా అందించింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీడబ్ల్యూఓ నరసింహారావు, సీపీఓ ఎల్.కిషన్, డీటీడీఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, డీసీఓ పద్మ, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి జగదీశ్‌రెడ్డి, మార్కెటింగ్ డీఎం శర్మ, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.


