యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్ అందజేత
యాదగిరిగుట్ట : భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పన్నాల సుభాషిని, వెంకట్‌రాంరెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పన్నాల జగన్‌మోహన్‌రెడ్డి జ్ఞాపకార్థం రూ.7.50లక్షలు విలువ చేసే బ్యాటరీ వాహనాన్ని యాదగిరిగుట్ట ఆలయ అధికారులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాటరీ వాహనానికి ఆలయాధికారులు, దాతలు సుభాషిని, వెంకట్‌రాంరెడ్డి, కుటుంబ సభ్యుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ బ్యాటరీ వాహనాన్ని వినియోగించాలని దాత ఆలయాధికారులను కోరారు. అనంతరం వారు యాదగిరీశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వెండి ఆరాధన పాత్రలు బహూకరణ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన బూస కృష్ణ, కుటుంబ సభ్యులు వెండి ఆరాధన పాత్రలను బహూకరించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం రూ.2.50లక్షలు (2 కిలోల 106 గ్రాములు) విలువ చేసే 5 పాత్రలతో పాటు ఒక ప్లేట్‌ను ఆలయ అర్చకులు, అధికారులకు అందజేశారు. అంతకుముందు బూస కృష్ణ, కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనం చేశారు.
పోలీస్ క్రికెట్ టోర్నీలో నల్లగొండ జట్టు విజయం
రామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి బెటాలియన్‌లో బుధవారం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీ పరిధిలో మూడు, ఏఆర్, డీపీఓ జట్లు మొత్తం ఐదు జట్లకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నల్లగొండ జట్టు విన్నర్, ఏఆర్ జట్టు రన్నర్‌గా నిలిచాయి. అనంతరం విన్నర్ జట్టుకు ఏఎస్పీ జి.రమేష్ టోర్నీ కప్ అందజేశారు.
యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్ అందజేత


