అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక
కనగల్ : కనగల్ మండలం దర్వేశిపురంలో బుధవారం అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన అర్చక సంఘం అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు.
ఫ అర్చక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గాద ఉమామహేశ్వరశర్మ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచార్యులు, మహంకాళి కిరణ్‌శర్మ, లహరి నరసింహాచార్యులు, బ్రాహ్మణపల్లి రవీందర్‌శర్మ, ప్రధాన కార్యదర్శిగా జీడికంటి అనంతాచార్యులు, సంయుక్త కార్యదర్శిగా కంభంపాటి రమణ, కోశాధికారిగా కారంపూడి మోహన్, సహాయ కార్యదర్శులుగా ఫణికుమారాచార్యులు, వలివేలు, విద్యాధరశర్మ, హరీష్‌శర్మ, ముడుంబై దామోదరచార్యులు, అత్తాంశ గోపాలచార్యులతో పాటు ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఫ ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడిగా జినుకుంట్ల చంద్రయ్య, గౌరవ సలహాదారులుగా రాజ్యలక్ష్మి, అధ్యక్షుడిగా అలుగుబెల్లి సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్‌రెడ్డి, కోశాధికారిగా కె. ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్. అంజనేయులు, కొండారెడ్డి, డి. శ్రీనివాస్, సమన్వయ సభ్యులుగా ఎన్. రమణ, గోవిందరెడ్డి, వీరయ్య, ప్రచార కార్యదర్శిగా ఎస్‌బీవీ యోగానందంతో పాటు 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, అర్చక సంఘం జేఏసీ అధ్యక్షుడు పరాశరం రవీంద్రాచార్యులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు కృష్ణమాచారి, జేఏసీ కన్వీనర్ డీవీకే శర్మ, ఉద్యోగుల వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శ్రవణ్‌కుమారాచార్యులు, జక్కాపురం నారాయణస్వామి, దిండిగల్ ఆనంద్‌శర్మ, అర్చక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహన్‌శర్మ, బండారు శ్రీనివాస్, అనిల్‌కుమార్, ట్రిపుల జై శర్మ తదితరులు పాల్గొన్నారు.


