రైతులు అప్రమత్తంగా ఉండాలి
మునగాల: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకువచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు కోరారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వస్తున్నందున ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త వహించాలని సూచించారు. మునగాల మండలం బరాఖత్‌గూడెంలో మునగాల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. కేంద్రానికి రోజూ ధాన్యం తీసుకువచ్చే రైతుల వివరాలను నిర్వాహకులు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. తేమశాతాన్ని పరిశీలించి నమోదు చేయాలని , ఏరోజు కాంటా వేసిన ధాన్యాన్ని అదేరోజు మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం రాశులపై తడవకుండా పట్టాలు కప్పి కాపాడుకోవాలని కోరారు. అంతకుముందు మునుగాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యాన్ని, ఎస్సీ బాలికల వసతిగృహంలో వంట గదులు, సరుకులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ వి.ఆంజనేయులు, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు, మునగాల, బరాఖత్‌గూడెం గ్రామపంచాయతీల కార్యదర్శులు చంద్రశేఖర్, శ్వేత, ఏఈఓ రేష్మ, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, సీఈఓ బసవయ్య, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి సుందరయ్య ఉన్నారు.
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు


