వరంగల్ సభను విజయవంతం చేయాలి
సూర్యాపేటటౌన్ : బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27 వతేదీన వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ సభ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు .


