నేటి నుంచి ఎస్‌ఏ–2 | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌ఏ–2

Apr 9 2025 1:34 AM | Updated on Apr 9 2025 1:34 AM

నేటి నుంచి ఎస్‌ఏ–2

నేటి నుంచి ఎస్‌ఏ–2

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల్లో బుధవారం నుంచి ఎస్‌ఏ(సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌)–2 పరీక్షలు జరగనున్నాయి. 9వ తేదీ నుంచి 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రారంభం కానుండగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రశ్నాపత్రాలను జిల్లా కేంద్రంలో భద్రపరిచారు. ఆ తర్వాత ప్రశ్నాపత్రాలను అయా మండలాలు, పాఠశాలలకు పంపిణీ చేశారు.

జిల్లాలో 1261 పాఠశాలలు...

జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 1,261 ఉన్నాయి. వీటిలో 1 నుంచి 9వ తరగతి వరకు 1.18లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ఎస్‌ఏ –2 పరీక్షలు రాయనున్నారు. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు సాధించిన మార్కులు, హాజరు వివరాలను ‘ఐఎస్‌ఎంఎస్‌’ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఈ నెల 23న తల్లి దండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి వెల్లడించనున్నారు.

ఫ 17వ తేదీ వరకు నిర్వహణ

షెడ్యూల్‌ ఇలా...

తేదీ సబ్జెక్ట్‌

9 తెలుగు

10 హిందీ

11 ఇంగ్లిష్‌(6 టు 9)

తెలుగు(1 టు 5)

12 సోషల్‌(6, 7),

మ్యాథ్స్‌(8, 9)

ఇంగ్లిష్‌(1 టు 5)

15 జనరల్‌ సైన్స్‌(6, 7),

ఫిజికల్‌ సైన్స్‌(8, 9)

మ్యాథ్స్‌( 1 టు 5)

16 మ్యాథ్స్‌(6, 7)

బయో సైన్స్‌(8, 9)

ఈవీఎస్‌(1 టు 5)

17 సోషల్‌

(8, 9వ తరగతులకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement