కక్షిదారులకు అందుబాటులో ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : న్యాయవాదులు కక్షిదారులకు అందుబాటులో ఉండాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్ శ్రీ అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సఖీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జువైనల్ కోర్టును ప్రారంభించి మాట్లాడారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలు నేరాలకు పాల్పడితే జువైనల్ కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. అదే విధంగా రిమాండ్‌లో భాగంగా నల్లగొండలొని చైల్ట్ హోంకు తరలించనున్నట్లు తెలిపారు. బాలలు చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి మంగళవారం కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ లాయర్లు తదితరుల పాల్గొన్నారు.
ఫ జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎమ్.శ్యామ్ శ్రీ


