శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

అగౌరవంతోనే.. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే

న్యూస్‌రీల్‌

మృత్యువుకూ రైతన్న లోకువేనా!

హతవిధీ..

● ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం

● మంగళవారం

సాయంత్రానికి సగటున 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

● జిల్లాకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌

బృందాలు రాక

● 115 పునరావాస కేంద్రాల ఏర్పాటు

ఇళ్లలోకి వరద నీరు

హుకుంపేటలోని సూరాడ వీధి, పూల వీధుల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో మహిళలు బకెట్‌లతో తోడి బయటకు పోయాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతం కావడంతో మోకాలి లోతులో వరద నీరు నిలిచిపోయింది. –వజ్రపుకొత్తూరు

ఎంపీటీసీలను కూటమి ప్రభుత్వం అగౌరవంతోనే సాగనంపుతోంది. మూడేళ్లుగా వేతనాలు

అందజేయకుండా ఇబ్బంది పెట్టింది. 8లో

జలమయమైన శ్రీకాకుళంలోని పీఎస్‌ఎన్‌ఎం స్కూల్‌ రోడ్డు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 1269.8 మి.మీ.వర్షం పడగా, సాయంత్రం ఆరు గంటల నాటికి జిల్లా వ్యాప్తంగా 1857.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావారణ శాఖ ప్రకటించింది. బుధవారం తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు..

కలెక్టరేట్‌ తో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాలకు ప్రత్యేకాధికారులు నియమించారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, విద్యుత్‌ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బుధవారం గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.

115 పునరావాస కేంద్రాలు..

విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం 11 తీర ప్రాంతాల్లో 115 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. నిత్యావసరాలు, జనరేటర్‌ వంటి వస్తువులను అందుబాటులో ఉంచారు.

తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

రణస్థలం: తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. మంగళవారం కొవ్వాడ, అల్లివలస, జీరుపాలెం పంచాయతీల్లో కలెక్టర్‌ పర్యటించారు. అత్యవసర సమయంలో తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరి ఓం పాండే, ప్రత్యేకాధికారి సుగుణాకర్‌, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు, జె.ఆర్‌.పురం సీఐ ఎం.అవతారం, ఎస్సై వి.సత్యనారాయణ పాల్గొన్నారు.

ప్రాజెక్టుల వద్ద జాగ్రత్త

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: వర్షాల నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు.

రైల్వే సబ్‌వేలో వర్షపునీరు

కాశీబుగ్గ: వర్షం ధాటికి గరుడఖండి–లక్ష్మీపురం గ్రామాల మధ్య రైల్వే సబ్‌వే పూర్తిగా జలమయమయ్యింది. ఉపమార్గంలోకి భారీగా వర్షపునీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, ఆ మార్గం గుండా వెళ్లవద్దని కాశీబుగ్గ పోలీసులు సూచించారు.

విద్యా సంస్థలకు సెలవు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ సమాచారం మేరకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సెలవును పరిహార సెలవుగా పరిగణిస్తామని, దీనికి బదులుగా మరొక సెలవు దినాన పనిచేయాల్సి ఉంటుందన్నారు.

నేలకూలిన చెట్టు

మెళియాపుట్టి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టుపురం సమీపంలోని ఆఫ్‌షోర్‌ కాలువ నిండిపోవడంతో రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో మెళియాపుట్టి మండలం నుంచి ఒడిశా గారబంద వైపు వెళ్లే రహదారి జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సిరియాఖండి వద్ద భారీ చింతచెట్టు విద్యుత్‌ స్తంభంపై కూలిపోయింది. విద్యుత్‌ శాఖ సిబ్బంది గ్రామస్తుల సహాయంతో తొలగించారు.

వంశధార తీరప్రాంతంలో అప్రమత్తం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భారీ వర్షాలు, తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా వంశధార నదీతీర ప్రాంతవాసులంతా అప్రమత్తంగా ఉండాలని బి.ఆర్‌.ఆర్‌ వంశధార ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ అరవల రవీంద్రబాబు, ఎస్‌ఈ రామచంద్రరావు సూచించారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు తుఫాను ప్రభావం ఉన్నందున వంశధార ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ ప్రధాన కాలువలను పూర్తిగా మూసివేసి, వరద ప్రభావం నుంచి కాలువలకు ఎటువంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపడేతున్నట్లు తెలిపారు. సమావేశంలో నరసన్నపేట డివిజన్‌ ఈఈ మురళీకృష్ణ, ఆమదాలవలస డివిజన్‌ ఈఈ సీతారాములునాయుడు, డీఈ రామకృష్ణ, గణేష్‌, పద్మజ, జాన్సీ, సత్యనారాయణ, జేఈలు, ఏఈలు పాల్గొన్నారు.

పోలీస్‌ కార్యాలయంలో

కంట్రోల్‌ రూమ్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో 2 ఎస్డీఆర్‌ఎఫ్‌, ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందంతో పాటు 17 ప్రత్యేక బలగాలను (ఎస్‌టీఎఫ్‌) సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచామని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి మంగళవారం చెప్పారు. ప్రజలకు అత్యవసర సేవలు వేగంగా అందేలా జిల్లా పోలీసు కార్యాలయంలో డయల్‌ 112, 6309990933 కంట్రోల్‌ రూమ్‌లతో పాటు 3 సబ్‌ డివిజన్లలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌లు, స్పెషల్‌ బ్రాంచి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌తో పోలీసు సిబ్బంది నిరంతర సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తారన్నారు. సముద్ర తీరాలు, నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనల వద్దకు ప్రజలు వెళ్లకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు ఇవే..

జిల్లా పోలీస్‌ కార్యాలయం 6309990933

శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం 6309990804

కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం 6309990805

టెక్కలి డీఎస్పీ కార్యాలయం 6309990811

స్పెషల్‌ బ్రాంచి 6309990911

కొవ్వాడ గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

బాహుదాలోకి వరదనీరు

ల్పపీడనం ప్రభావంతో ఆంధ్రా, ఒడిశాలో కురుస్తున్న వర్షానికి బాహుదానదిలోకి వరద నీరు చేరుతోంది. మంగళవారం రాత్రికి 1500 క్యూసెక్కుల నీరు చేరిందని, రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరిగేషన్‌ జేఈ మధుసూదన పాణీగ్రహి తెలిపారు. –ఇచ్ఛాపురం రూరల్‌:

కల్లోల కడలి

తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో ఇప్పటికే వేట సామగ్రి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 90 రోజులుగా వేట లేక అవస్థలు పడుతున్న తమకు తాజా తుఫాన్‌ మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని వజ్రపుకొత్తూరు చెందిన మత్స్యకారులు జి.శంభూరావు, చిన్నారావు, రాజులు తదితరులు వాపోయారు. –వజ్రపుకొత్తూరు/ఇచ్ఛాపురం రూరల్‌/కాశీబుగ్గ

విద్యుత్‌ సమస్యలు తలెత్తితే..

అరసవల్లి: తుఫాన్‌ నేపథ్యంలో ఈ నెల 26 వరకు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవనున్న నేపథ్యంలో విద్యుత్‌ పరంగా తమ శాఖ అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉందని సర్కిల్‌ ఎస్‌ఈ జి.ఎన్‌.ప్రసాద్‌ ప్రకటించారు.

శ్రీకాకుళం సర్కిల్‌

కార్యాలయం 9490612633

శ్రీకాకుళం డివిజన్‌ 9490610010

టెక్కలి డివిజన్‌ 9490610050

పలాస డివిజన్‌ 9490612676

మంగళవారం వర్షపాతం ఇలా..

మండలం పలాస వజ్రపుకొత్తూరు టెక్కలి సంతబొమ్మాళి కోటబొమ్మాళి నరసన్నపేట పోలాకి సరుబుజ్జిలి పాతపట్నం నందిగాం బూర్జ సోంపేట గార శ్రీకాకుళం కవిటి

మి.మి.లలో 96.4 96.4 89.6 89.4 88.8 82.8 79.4 72.6 67.6 66.6 65.8 64.4 61.6 60.2 59.2

ఆమదాలవలస జలుమూరు మెళియాపుట్టి పొందూరు లావేరు ఎల్‌ఎన్‌ పేట కంచిలి హిరమండలం ఎచ్చెర్ల రణస్థలం కొత్తూరు మందస ఇచ్ఛాపురం జి.సిగడాం సారవకోట

59.0 58.6 57.2 56.2 55.4 54.2 52.0 51.8 51.0 43.1 41.2 38.6 35.2 31.6 31.2

కుర్చీకి నమస్కరిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

జి.సిగడాం(పొందూరు): ఎటు చూసినా అననుకూల పరిస్థితులే.. పంట పండించడానికి ప్రకృతికి ఎదురెళ్లాలి.. వనరులు సమకూర్చుకునేందుకు మార్కెట్‌ శక్తులతో పోరాడాలి. పండిన పంటను అమ్ముకునేందుకు దళారీ వ్యవస్థను అధిగమించాలి. ఇన్ని ప్రతికూలతలను తట్టుకునేందుకు.. తన పంటను తానే అమ్ముకునేందుకు జోరు వానలోనూ రోడ్డెక్కిన రైతన్న తెగువను చూసి చివరికి మృత్యువుకూ కన్నుకుట్టినట్లుంది. బస్సు రూపంలో దూసుకొచ్చి ఆ అభాగ్యుడి ప్రాణాలనే ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం అదే.. విగతజీవిగా పడి ఉన్న రైతు పేరు లోలుగు కన్నంనాయుడు(55). స్వగ్రామం పొందూరు మండలం లోలుగు. భార్య విజయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పొలంలో పండించిన కూరగాయలను దళారులకు తక్కువ ధరకు ఇచ్చి నష్టపోకూడదన్న ఉద్దేశంతో తానే స్వయంగా ప్రతిరోజూ ఉదయాన్నే శ్రీకాకుళం రైతుబజారుకు తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. అదే క్రమంలో మంగళవారం వేకువజామున ద్విచక్ర వాహనంపై కూరగాయలు తీసుకుని శ్రీకాకుళం వెళ్తుండగా కేశవదాసుపురం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ఆ రైతు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కూరగాయలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. రైతుల జీవన పోరాటాన్ని.. చివరికి ప్రకృతి శక్తులు కూడా సహకరించని దుస్థితిని ఈ రైతు మరణం చాటిచెబుతుంది.

గొట్టా బ్యారేజీ వద్ద 20 గేట్లు ఎత్తివేత

హిరమండలం: వంశధార గొట్టాబ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం వరదనీరు పెరిగింది. ఒడిశా కేచ్‌మెంట్‌ ఏరియాతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి 37.40 మీటర్ల నీటిమట్టం ఉంది. సోమవారం సాయంత్రానికి 2200 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ ఫ్లో మంగళవారం ఉదయం నాటికి 8500 క్యూసెక్కులకు చేరింది. 20 గేట్లను 20 సెంటీమీటర్లు మేర పైకి ఎత్తి దిగువకు 13288 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి, ఏఈ ఆనందరావు తెలిపారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీటిని నిలుపుదల చేసినట్లు చెప్పారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలిపారు.

గార:బందరువానిపేట–శ్రీకాకుళం రూట్‌లో వర్షానికి బస్సు కారిపోవడంతో గొడుగు పట్టుకున్న ప్రయాణికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement