టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కొత్తపేట సమీప జాతీయ రహదారిపై మంగళవారం లారీ బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... బొగ్గులోడుతో ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ, కొత్తపేట వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా మరమ్మతులకు గురైంది. లారీలో ఉన్న డ్రైవర్, సహాయకుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం హైవే సిబ్బంది రహదారికి అడ్డంగా పడివున్న లారీని క్రేన్ సాయంతో తొలగించారు.


