ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి, శ్రీకాకుళం రూరల్ మండలం సొట్టవానిపేట పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. ఆమదాలవలస ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం నవనంబాబు గ్రామానికి చెందిన చల్లా బుచ్చిబాబు(45) తన గ్రామం నుంచి బలగలో ఉండే తన భార్య లక్ష్మి వద్దకు వెళ్లేందుకు బయల్దేరాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఆయనను నరసన్నపేట వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని భార్య చల్లా లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.


