ప్రజలకు అండగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అండగా ఉండండి

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. బుధ, గురువారాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, కమిటీ ప్రతినిధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement