ఈ విజయం | - | Sakshi
Sakshi News home page

ఈ విజయం

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

ఈ విజయం

అందరి సహకారంతోనే

● డీఎస్సీ అక్రమాలపై చర్చకు తోక ముడిచిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌

● ఎప్పుడైనా చర్చకు రావచ్చన్న ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌

● జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ

జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ భావోద్వేగం

● ముగిసిన చివరి పాలకవర్గ సర్వసభ్య సమావేశం

చర్చకు రమ్మంటే భయమెందుకో?

ఆమదాలవలస: డీఎస్సీ అక్రమాలపై ఆమదాలవలస పట్టణంలో బహిరంగ చర్చకు రాకుండా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తోక ముడిచారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ దుయ్యబట్టారు. మంగళవారం పట్టణ శివారులోని వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన డీఎస్సీ అక్రమాల బహిరంగ చర్చా కార్యక్రమానికి జోరువానను కూడా లెక్కచేయకుండా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతాడ రవికుమార్‌ చేరుకున్నారు. కాసేపు వేచి ఉండి అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లి విలేకరులతో మాట్లాడారు. కూన రవికుమార్‌కు దమ్ముంటే రానున్న రెండున్నరేళ్లలో ఎప్పుడైనా తమతో చర్చకు రావచ్చని సవాల్‌ విసిరారు. ఈ నెల 14న జరిగిన సమావేశంలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని కూన రవికుమార్‌ చెప్పడంతో తాను బహిరంగ చర్చ పెట్టానన్నారు. నిజాలు బయట పడతాయనే భయంతోనే ఎమ్మెల్యే కూన రవికుమార్‌, టీడీపీ నాయకులు హాజరు కాలేదన్నారు. బహిరంగ చర్చను అడ్డుకునేందుకు పోలీసులను వినియోగిస్తూ నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. కూన రవికుమార్‌ ఆమదాలవలసలో చేసిన కోట్ల రూపాయల స్కాములను ప్రజలకు తెలియజేస్తున్నామని, అందుకే వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారన్నారు. అయినా తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ సత్యప్రసార్‌, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కింజరాపు సురేష్‌, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, దుంపల శ్యామలరావు, మూడడ్ల రమణ, బొడ్డేపల్లి వెంకట సత్యం, అత్తులూరి రవికాంత్‌, మామిడి రమేష్‌, నున్నగాపుల చిన్నారావు, పొదిలాపు తిరుపతిరావు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అరసవల్లి : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు మారుమోగింది. జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయతో పాటు మిగిలిన జెడ్పీటీసీలు, ఎంపీపీలంతా తమకు ఇంతటి స్థాయినిచ్చినందుకు జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన, సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, డీఆర్‌డీఏ తదితర ప్రభుత్వ శాఖల ప్రగతి నివేదికలపై సమీక్షించారు. జెడ్పీ పాలక వర్గ సభ్యులకు ఇదే చివరి సమావేశం కావడంతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా పునర్విభజనలో భాగంగా రాజాం, పాలకొండ నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు..శ్రీకాకుళం జిల్లా పరిషత్‌తో నేటి సమావేశంతో రుణం తీరిపోయిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ భారతీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సత్కారాలు..

పాలకవర్గానికి చివరి సమావేశం కావడంతో చైర్‌పర్సన్‌ పిరియా విజయకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, మామిడి గోవిందరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, జెడ్పీ వైస్‌చైర్మన్లు జగన్మోహనరావు, పాలిన శ్రావణి, హిరమండలం టీడీపీ జెడ్పీటీసీ బుచ్చిబాబు ఘనంగా సత్కరించారు. ఐదేళ్ల పాలనలో ఎక్కడా నెగటివ్‌గా వినలేదని చైర్‌పర్సన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే కూన ప్రశంసించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, జెడ్పీ వైస్‌చైర్మన్లు జగన్మోహనరావు, పాలిన శ్రావణిలు కూడా చైర్‌పర్సన్‌ను సత్కరించారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలను విజయ సన్మానించగా.. మళ్లీ మనం గెలిచి ఇక్కడి అధికారం చేపట్టాలంటూ ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్ప వ్యాఖ్యానించడంతో సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

పారదర్శక పాలన అందించా...

జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలిగా నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అవకాశంతో ఐదేళ్ల పాటు పారదర్శక పాలన చేసే అవకాశం వచ్చిందని చైర్‌పర్సన్‌ విజయ అన్నారు. ముందుగా చైర్‌పర్సన్‌ కుర్చీకి నమస్కరించి అనంతరం మాట్లాడారు. ఎలాంటి పాలనానుభవం లేని తాను ఈ పదవిని చాలెంజ్‌గా భావించి పారదర్శకంగా ఉద్యోగాల నియామకాలు చేపట్టడం సంతృప్తినిచ్చిందన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.31.15 కోట్లు, జెడ్పీ జనరల్‌ ఫండ్‌ రూ.35.55 కోట్లు మొత్తంగా రూ.65.70 కోట్ల మేర నిధులు జిల్లా అభివృద్ధికి ఖర్చు చేశామ న్నారు. జిల్లా పరిషత్‌లో విద్యుత్‌ బిల్లుల నియంత్రణకు 60 కె.వి. గ్రిడ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. 120 మందికి కారుణ్య నియామకాలను, 126 మందికి పదోన్నతులు, బ్యాక్‌ల్యాగ్‌లో ముగ్గురికి ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement