శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాల సేవలకు సంబంధించి వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు సెప్టెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి రెల్ల వీధిలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. ఈ మేరకు గు రువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తపాల సేవలకు సంబంధించిన ప్రత్యేక, వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్‌లో సమర్పిస్తామని తెలిపారు. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాల వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు ఈనెల 22వ తేదీ లోగా ‘తపాల అదాలత్’ అనే శీర్షికతో వి.హరిబాబు, సూపరింటెండెంట్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్–శ్రీకాకుళం– 532001‘ అనే చిరునామకు పంపించాలని ఆయన తెలిపారు. గడువు తేదీ ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబోమని పేర్కొన్నారు. ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకొని తపాలా అదాలత్ కు హాజరు కావచ్చునని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలు సంబందించిన విషయాలపై ఫిర్యాదులు తీసుకోబోమని ఆయన తెలిపారు.
ఉత్తరాంధ్ర పర్యాటకానికి ఊతం
శ్రీకాకుళం పాతబస్టాండ్,అరసవల్లి: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్‌తో కలిసి గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. అరసవల్లి సూర్యదేవుని ఆలయ పరిసరాల్లో భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం భోజనశాల, వాహనాల పార్కింగ్ కేంద్రం, రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో సూర్యభగవా నుని విశేషాలతో ప్రత్యేక అనుభూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కలెక్టరేట్ సమీపంలోని పురాతన భవనాన్ని పునరుద్ధరించి జిల్లా చరిత్ర ప్రతిబింబించేలా మ్యూజియంగా మా రుస్తామని తెలిపారు. పర్యాటకులు కేవలం విశాఖపట్నానికే పరిమితం కాకుండా అరసవల్లి, భావనపాడు తదితర ప్రాంతాలను సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.


