● 75 సెంట్లు స్థలంపై కబ్జాదారుల కన్ను
● దొంగ సర్టిఫికెట్లతో మ్యూటేషన్ చేసేందుకు
పంచాయతీ సెక్రటరీ యత్నం
● కోర్టుకెళ్లడంతో వృద్ధుడికి అనుకూలంగా స్టే
● ఆక్రమణదారులకు అండగా నిలిచిన టీడీపీ నాయకులు
● బాధితుడి కుమార్తెకూ నాయకుల
బెదిరింపులు
● మానసిక క్షోభతో వృద్ధుడు మృతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
టీడీపీ అల్లరిమూకల అరాచకాలు, బెదిరింపులు ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడి భూమి ఆక్రమణదారుల పాలవడం, ఫిర్యాదు ఇచ్చారని పోలీసుస్టేషన్‌లో తన కుమార్తెకు ఆక్రమణదారుడి ముఠా వార్నింగ్‌లు ఇవ్వడంతో తట్టుకోలేక మానసిక క్షోభకు గురై ప్రాణాలు విడిచాడు. శ్రీకాకుళం నగరంలో దండి వీధిలో జరిగిన ఈ ఘటన టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు పరాకాష్టగా నిలిచింది. వృద్ధుడ్ని బలి తీసుకున్న పచ్చనాయకుల భూదందా నగరంలో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే..
శ్రీకాకుళం నగరంలోని దండివీధిలో కస్పా అప్పన పట్నాయక్(70)కు 75.5 సెంట్లు భూమి ఉంది. రెవెన్యూ సర్వే నంబర్.248–2లో ఉన్న కోట్ల రూపాయల విలువైన స్థలం కావడంతో పంచాయతీ సెక్రటరీ కస్పా శివచరణ్ దొంగ పత్రాలను సృష్టించారు. తర్వాత కస్పా రవికిరణ్, కస్పా శివచరణ్ పేర్ల మీద మ్యూటేషన్ చేసేందుకు ప్రయత్నించడంతో అప్పన పట్నాయక్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా స్పందిస్తూ స్టే ఇచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో యథాస్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆక్రమణదారుల ఆగడాలు ఆగలేదు. ఫాజుల్‌బాగ్‌పేట నుంచి కొన్ని అల్లరి మూకలతో కలిసి తరచూ వృద్ధుడ్ని వేధింపులకు గురి చేసి భయాందోళన కలిగించారు.
టీడీపీ నాయకుల వేధింపులకు మృతి చెందిన
వృద్ధుడు కస్పా అప్పన పట్నాయక్
అప్పన పట్నాయక్ స్థలంలో హల్‌చల్ చేస్తున్న టీడీపీ నాయకుడు, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ దొండపాటి నవీన్ తదితరులు (ఫైల్)
బతికుండగా వృద్ధుడు కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు లేఖ
కస్పా అప్పన పట్నాయక్‌కు
చెందిన పట్టాదారు పాసు
పుస్తకం
అప్పన పట్నాయక్ స్థలంలో పార్కింగ్ చేసిన కారు


