ఈ క్రమంలో టీడీపీ నాయకుడు, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ దొండపాటి నవీన్ తదితరులు ఆ స్థలంలో హల్‌చల్ చేశారు. దౌర్జన్యకర రీతిలో వ్యవహరించారు. ఇలా బెదిరింపులు, వేధింపులు నడుస్తున్న వేళ అలపాన గోవిందరావు అనే వ్యక్తి ఆ స్థలంలో కారు పార్కింగ్ చేశాడు. ఆ వాహనాన్ని తీయండి అని అడిగినా లెక్క చేయలేదు. ఆక్రమిత భూమిలో మూడు సెంట్లు ఇచ్చేందుకు పంచాయతీ సెక్రటరీతో చేసుకున్న ఒప్పందం మేరకు గోవిందరావు అక్కడ పార్క్ చేసి మొండిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆ స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ప్రతిసారి కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించేలా, చట్టబద్ధ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కస్పా అప్పన పట్నాయక్ ఏకంగా జిల్లా కలెక్టర్‌కు ఆగస్టు 24న ఫిర్యాదు లేఖ రాశారు. అయినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో ఈ నెల 1న శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ిఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత పోలీసు స్టేషన్‌కు వచ్చిన కస్పా అప్పన పట్నాయక్ కుమార్తె వెంకట లక్ష్మీని టీడీపీకి చెందిన దొండపాటి నవీన్, గోవిందరావు, వారి అనుచరులు 10 మంది గంట సేపు భయభ్రాంతులకు గురి చేసేలా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తట్టుకోలేక ఆమె విలపిస్తూ ఇంటికి వెళ్లిపోయారు. ఎవరి దగ్గరికి వెళ్లినా లాభం లేదన్నట్టుగా భయపెట్టారు. ఓవైపు దౌర్జన్యం, మరోవైపు వేధింపులు, ఇంకోవైపు తన కుమార్తె విలపించేలా బెదిరింపులు వెరసీ అప్పన పట్నాయక్‌ను తీవ్రంగా కలిచి వేశాయి. జరిగిన పరిణామాలకు కలత చెంది అప్పన పట్నాయక్ బుధవారం కన్నుమూశారు.


