ఎచ్చెర్ల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థఽ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్ సెంటర్‌లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్ (డిజిటల్ మిత్ర) కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎలక్ట్రీషియన్ కోర్సుకు టెన్త్, కంప్యూటర్ కోర్సుకు ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 15లోగా స్కిల్ హబ్ సెంటర్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 7989177887 నంబరును సంప్రదించాలని కోరారు.
ఐసీడీఎస్ పీడీగా శోభారాణి
శ్రీకాకుళం అర్బన్: సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా (ఎఫ్‌ఏసీ) పి.శోభారాణి నియమితులయ్యారు. ఐసీడీఎస్ సంస్థ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. శోభారాణి ప్రస్తుతం నరసన్నపేట ప్రాజెక్టు సీడీపీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పీడీగా బాధ్యతలు నిర్వహించిన ఎస్.సువర్ణ బాపట్ల పీడీగా బదిలీపై వెళ్లారు.
కూర్మనాథాలయ ఈఓగా విమలాకుమారి
గార : శ్రీకూర్మంలోని కూర్మనాథాలయ ఈఓగా విజయనగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి టి.విమలాకుమారి నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
20న జిల్లా అథ్లెటిక్స్
క్రీడాకారుల ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 20న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు), అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 9 గంటల నుంచి అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాల్లో ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. బాలబాలికలకు వేరువేరుగా రన్స్, త్రోస్, జంప్స్‌ను నిర్వహించి మెరుగైన ట్రాక్ రికార్డులను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను త్వరలో జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు తమ జనన ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, టెన్త్ మార్క్స్ మెమో, 2 పాస్‌ఫొటోలతో స్టేడియం ప్రాంగణంలో సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు వద్ద రిపోర్ట్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 94415 70361 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కొత్తూరు: ఆకులతంపర గ్రామ సమీపంలో వంశధార నదిలో ఇసుక ర్యాంపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న ప్రొక్లెయినర్, టిప్పర్‌తో పాటు మరో నాలుగు యంత్రాలను సీజ్ చేసినట్లు తహశీల్దార్ సరోజని తెలిపారు. బుధవారం ఇసుక ర్యాంపులో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమెతో పాటు సర్వేయర్ రెడ్డి గవరయ్య ఉన్నారు.


