శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. యనమల హటకేశం (41) వృత్తిరీత్యా వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. బుధవారం రాత్రి ఒక ఇంటిపై సోలార్ ప్యానల్ బిగించడానికి వెళ్లి.. ఇంట్లోంచి ఒక వైరును లాగుతూ మేడమీద సోలార్ బిగించే క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


