రణస్థలం: పైడిభీమవరంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాయి. వీరిని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎడ్ల అక్కన్న, కొప్పిశెట్టి అప్పారావు, సన్యాసిరావు, గారి సాయి, గేదెల సతీష్, దన్నాన రాంబాబు, కోలిసి మణికంఠ, రమణమ్మ, నక్కిన పవన్, పాండ్రంగి మురళి, కోప్పిశెట్టి దేవి, బంగారమ్మ, రామలక్ష్మీ, బంటు సంతోష్ ఇలా 50 కుటుంబాల వారు ఉన్నా రు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి, ప్రతి పేద కుటుంబానికి అందిన సంక్షేమ ఫలాలు ఒక్క వైఎస్సార్‌సీపీకే సాధ్యమని, మళ్లీ ఆ నమ్మకానికి గుర్తుగా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేలా క్షేత్రస్థాయిలో కష్టపడి అందరూ సమష్టిగా పని చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొర్లె శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ లంకలపల్లి ప్రసాదరావు, నాయకులు భావిశెట్టి సీతారామయ్య, గుడివాడ నందీశ్వర రావు, అల్లంపల్లి సతీష్, డొప్ప రాము యాదవ్, జాడ శంకర్ యాదవ్, ముక్కు దాలప్పడు, సరగడ రామసూరి తదితరులు పాల్గొన్నారు.


