భరతం పడదాం..
ప్రజా వ్యతిరేక ప్రభుత్వం భరతం పట్టాలి. అందుకు శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికల యుద్ధభూమిగా భావించాలి. ఎన్నికల ముందు హామీలివ్వడం వాటిని కాగితాలకే పరిమితం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.
– కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ
వెన్నుపోటు కొనసాగుతోంది
ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు చంద్రబాబు వెన్నుపోటు పర్వం కొనసాగుతూనే ఉంది. ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల్లో గెలుద్దాం.
– నర్తు రామారావు, ఎమ్మెల్సీ
నియామకాల్లో మోసాలు
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చి అడ్డంగా దొరికినపోయినవారే తప్పు ఒప్పుకుంటూ ఉంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంకా బుకాయించడం సరికాదు. పైగా లోకేష్ సమర్థుడని చంద్రబాబు కితాబునిస్తున్నారు. డీఎస్సీ వంటి స్కాములే వారి సమర్థత. – పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్సీ
2029కు ప్రణాళిక రచిద్దాం
2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలి. ధర్మాన లాంటి ఆలోచన పరు డు, దిశానిర్దేశకులు మనకు ఉండటం చాలా అదృష్టం.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ
పార్టీకి పనిచేయాలి
పార్టీకి పనిచేసిన వారికే అగ్రపీఠం వేస్తాం. కూటమి వైఫల్యాల్ని, అరాచకాల్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయాలి.
– గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
టెక్కలిలో అచ్చెన్న బంధువులకే అన్నీ
టెక్కలిలో అచ్చెన్నాయుడు బంధువులే అన్నింటా ఉన్నారు. ఇసుక తరలిస్తున్నారని పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు డిజిటల్ బుక్‌ను ఉపయోగించుకోవాలి.
– పేరాడ తిలక్, పార్టీ టెక్కలి సమన్వయకర్త
ఓటు అడిగే హక్కు మనకే ఉంది
గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన వైఎస్సార్ సీపీకే స్థానిక సంస్థల్లో ఓటు అడిగే హక్కు ఉంది. మన ఐదేళ్లలో జరిగిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉంది. – చింతాడ రవికుమార్,
పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త


