పోర్టుకు రాకపోకలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

పోర్టుకు రాకపోకలు బంద్‌

Sep 8 2026 12:59 AM | Updated on Sep 8 2026 12:59 AM

సంతబొమ్మాళి: జీతాలు చెల్లించాలంటూ మూలపేట పోర్టుకు వెళ్లే రహదారిని సిబ్బంది సోమవారం బంద్‌ చేశారు. మూలు నెలలుగా జీతాల చెల్లింపు విషయంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు పలుమార్లు విఫలం కావడంతో నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. పోర్టుకు వెళ్లే రహదారిలో అడ్డంగా కర్రలను ఏర్పాటు చేసి వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. జీతాలు చెల్లించకుండా యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండి ప డ్డారు. జీతాలు ఇచ్చేవరకు విధుల్లోకి వచ్చేది లేదని హెచ్చరించారు. నిరసనను కొనసాగిస్తూ సిబ్బంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బియ్యం అయిపోయాయి.. మళ్లీ రండి!

నరసన్నపేట: బియ్యం ధరలు చుక్కలను తాకుతున్న తరుణంలో ఎంతో ఆర్భాటంగా ప్రభు త్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ ధరల సన్న బియ్యం వినియోగదారులకు అందడం లేదు. సబ్సిడీ బియ్యం ఉన్నాయా.. అని వినియోగదారులు షాపునకు వెళ్లి ఆరా తీస్తుంటే.. ‘బియ్యం అయి పోయాయి.. మళ్లీ రండి’ అనే సమాధానమే మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. వాస్తవానికి ఒక్కో తెల్ల కార్డుకు నెలకు పది కిలోలు చొప్పున అందివ్వాలి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వినియోగదారులకు ఈ విధంగా తక్కువ ధరకు బియ్యం ఇస్తున్నట్లు అధికారులు, పాలకులు చెబుతున్నారు. కానీ బియ్యం మాత్రం అందడం లేదు. స్థానిక సివిల్‌ సప్‌లై డీటీ రామకృష్ణ వద్ద ప్రస్తావించగా పరిశీలించి నిల్వలు ఉంటేటట్లు చూస్తామని అన్నారు.

17 నుంచి ఫొటోగ్రఫీలో యువతకు ఉచిత శిక్షణ

శ్రీకాకుళం కల్చరల్‌: యూనియన్‌ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఎచ్చెర్ల లో 17 నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఫొటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని డైరెక్టర్‌ రామ్‌ జీ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజ న సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు యూనియన్‌ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, ఎంఆర్‌వో ఆఫీస్‌ రోడ్‌, ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా, ఫోన్‌నంబర్‌ 95534 10809, 7993340407, 8790983050 ను సంప్రదించాలని కోరారు.

10 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్‌

ఇచ్ఛాపురం: స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 9.890 కిలోల గంజాయితో తమిళనాడు, రా మంతపురం జిల్లా కవరంకుళం గ్రామానికి చెందిన బాలమురళీకృష్ణన్‌ సెల్వరాజ్‌ అనే యువకుడు పట్టణ పోలీసులకు పట్టుబడ్డారని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. సీఐ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితుడు చైన్నె ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తు పూనమల్లే ప్రాంతంలో ఒకరూమ్‌లో అద్దెకు ఉండేవాడని, గంజాయి సేవించడానికి అలవాటు పడడం వల్ల కంపెనీలో చేస్తున్న పనిమానేశా డని తెలిపారు. ఆర్థికపరిస్థితి బాగులేకపోవడంతో పూనమల్లే ప్రాంతంలో గంజాయి వ్యాపా రం చేసే దనీస్‌ అనే వ్యక్తిని కలిశాడని పేర్కొన్నారు. దనీష్‌ ఒడిశాలోని భువనేశ్వర్‌, ఖుర్ధా జంక్షన్‌ గొడిపద టోల్‌ప్లాజాకి వెల్లి అక్కడ కమల్‌లోచన్‌ బెహర వద్ద నుంచి గంజాయిని తీసుకువస్తే రూ.15వేలు ఇస్తానంటే ఆశపడి సెల్వరాజ్‌ ఇక్కడకు వచ్చాడని వివరించారు. దాదా పు పది కిలోల గంజాయిని తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులకు దొరికాడని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకొని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో సీఐతో పాటు పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement