శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Sep 8 2026 12:59 AM | Updated on Sep 8 2026 12:59 AM

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

పాలకులను ప్రశ్నిద్దాం..

టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఓటు అడగడానికి వస్తే ప్రశ్నించాలి. ఇప్పటికే మూడు బడ్జెట్‌లు అయిపోయాయి. ఇంకా రెండు బడ్జెట్‌లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేటాయించకపోవడం దారుణం. ఏదో మొక్కుబడిగా అంకెల గారడీగా పేపర్లకే పరి మితం చేయడం, నిధులు విడుదల చేయకపోవడం చంద్రబాబుకి పరిపాటిగా మారింది. యారియా బస్తా రూ.2వేలకు అమ్మడం చరిత్రలో ఎన్నడూ జరగలేదు. వైఎస్‌ జగన్‌ హయాంలో ఇంటికే యూరి యా అందించేవాళ్లం. రైతు పండించుకున్న పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం చంద్రబాబుది. శివారు ప్రాంతాలైన రణస్థలం, లావే రు, ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాలకు కనీసం సాగునీరు ఇవ్వలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉందాం. డిజిటల్‌ బుక్‌లో వేధించే అధికారుల వివరాలు నమోదు చేయాలి. త్వరలోనే చలో బుడగట్లపాలెం నిర్వహిస్తాం.

– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి

సైనికుల్లా పనిచేయండి

వైఎస్సార్‌సీపీ పార్టీ కోసం నిష్పక్షపాతంగా సైనికుల్లా పనిచే యండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి. ఏదైనా గ్రామంలో ఒకే పదవికి ఇద్దరు పోటీ ఉంటే నియోజకవర్గ ఇన్‌చార్జిలకు చెప్పి ఒకరు వెనక్కి తగ్గేలా చేయాలి. ప్రతి గ్రామంలో కూటమి నాయకుల అవినీతిని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసాల్ని వివరించాలి.

– ధర్మాన కృష్ణదాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు

అంతా అవినీతే..

లోకేష్‌ యువగళం పాదయాత్రలో నడిచిన వారికి డీఎస్సీ– 2025లో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం దారుణం. చంద్రబాబు, లోకే ష్‌లు మెగా డీఎస్సీ పేరుతో కోట్లాది రూపాయలకు ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, సచివాలయాల నిర్మాణాలు చేశాం. కూటమి హయాంలో అవినీతి, అక్రమాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.

– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి

ఎన్నికలు వస్తేనే పింఛన్లు

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే నే చంద్రబాబుకు పింఛన్లు గుర్తుకు వచ్చాయి. మా ప్రాంతంలో కరువు ఉందంటే ప్రభుత్వం పట్టించుకోవ డం లేదు. వ్యవసాయశాఖ మంత్రి ఉన్నా రైతుల కష్టాలు వీడడం లేదు. – సాడి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి,

పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త

చంద్రబాబు జిల్లాకు ఏనాడైనా పైసా ఇచ్చారా..?

స్థానిక సంస్థల్లో సత్తా చాటుదాం

వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ధర్మాన ప్రసాదరావు

పార్టీ కోసం పనిచేసి పదవులు

అందుకోండి: ధర్మాన కృష్ణదాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement