సంగ్రామానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సంగ్రామానికి సిద్ధం

Sep 8 2026 12:59 AM | Updated on Sep 8 2026 12:59 AM

సచివాలయాలే టార్గెట్‌దొంగలు రెచ్చిపోతున్నారు. సచివాలయాలే టార్గెట్‌గా పెట్టుకున్నారు. –8లో ●

సచివాలయాలే టార్గెట్‌దొంగలు రెచ్చిపోతున్నారు. సచివాలయాలే టార్గెట్‌గా పెట్టుకున్నారు. –8లో

అగౌరవపరిచారు

కూటమి అధికారంలోకి రాగానే సర్పంచ్‌ల చెక్‌పవర్లు రద్దు చేశా రు. స్థానిక నాయకులను అగౌరవపరచడం సరికాదు. బిల్లులు కూడా ఇవ్వడం లేదు.

– పిరియా విజయ, జెడ్పీ చైర్‌పర్సన్‌

మేనిఫెస్టో నిండా మోసాలే

టీడీపీ మేనిఫెస్టో మొత్తం మోసాలమయమే. దాన్ని జనాలకు వివరించాలి. జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ ప్రాంతానికి చేసింది శూన్యం. ఎంపీ కేవలం స్నాప్‌, సెల్ఫీ, స్మైల్‌, (ట్రిపుల్‌ ఎస్‌)కి పరిమితమైపోయారు.

– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ):

చంద్రబాబు తొలిసారి అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఏనాడైనా జిల్లా అభివృద్ధికి పైసా ఇచ్చారా, టీడీపీకి అసలు ఎందుకు ఓటే యాలి అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూటిగా ప్రశ్నించారు. సిక్కోలు అభివృద్ధిలో వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌లదే కీలక పాత్ర అని గుర్తుచేశారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యా లయంలో సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సమన్వయకర్తలతో పాటు ముఖ్యనాయకులకు పార్టీ గుర్తింపు కార్డులు అందించారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయ కులు అంధవరపు సూరిబాబు, దుంపల లక్ష్మణరావు, కేవీజీ సత్యనారాయణ, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీనివాసరావు, ఎంవీ స్వరూప్‌, బొడ్డేపల్లి పద్మజ, మీసాల నీలకంఠంనాయడు, పిన్నింటి సాయి, చల్ల రవికుమార్‌, గేదెల పురుషోత్తం, పొన్నాడ రుషి, కోణార్క్‌ శ్రీను, రౌతు శంకరరావు, మార్పు పృథ్వీ, ముత్తా విజయ్‌కుమార్‌, మార్పు అశోక్‌కుమార్‌, గంట్యాడ రమేష్‌, ఎంఏ భేగ్‌, ప్రత్తి అన్వేష్‌, పిల్లల రామకృష్ణ, బుక్కూరు ఉమామహేశ్వరరావు, సనపల నారాయణరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్‌, పీస గోపి, శిష్టు గోపి, పతివాడ గౌరీశ్వరరావు, అంధవరపు రమేష్‌, అంధవరపు సురేష్‌, వి.బాలరాజు, పిలక రాజ్యలక్ష్మి, బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌, ఎంఏ రఫీల పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ బుక్‌ కమిటీ నియామకం

ఈ సందర్భంగా డిజిటల్‌ బుక్‌ కమిటీని నియమించి చైర్మన్‌గా శిమ్మ రాజశేఖర్‌, సభ్యులుగా నర్తు నరేంద్రయాదవ్‌, పుట్టా మోహన్‌రెడ్డిలను నియమించారు. పార్టీకి చెందిన వారికి సంక్షేమాలు ఆపడం, ఇతరత్రా వేధింపులకు పాల్పడడం గమనిస్తే ఈ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. ఈ కమిటీ సభ్యులు అధికారులతో మా ట్లాడతారని, అప్పటికే వేధింపులు ఆగకపోతే డిజిటల్‌ బుక్‌లో పేర్లు నమోదుచేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

● మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి, పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతిలు మాట్లాడుతూ ఇచ్ఛాపురంలో కేంద్ర మంత్రి పోర్టుకు శంకుస్థాపన చేయడం హాస్యాస్పదమన్నారు. పాలకుల అవినీతిని ప్రజల ముందు ఉంచాలన్నారు.

● పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నారని, మొక్కజొన్నకు విపరీతమైన నష్టం వచ్చిందని పేర్కొన్నారు. ఎరువులు తరలిపోతున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement