ఇదేంటి లోకేశం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
సకల శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న నారా లోకేష్ అసలు శాఖను నిర్వీర్యం చేసేశారు. విద్యావ్యవస్థను భ్రష్టు
పట్టించేశారు. విద్యార్థులకు ఇచ్చే విద్యా మిత్ర కిట్‌ల దగ్గరి నుంచి మధ్యాహ్నం భోజనం వరకు, ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్స్ నుంచి సుద్దముక్కలు, డస్టర్లు వరకు ఇబ్బందులు తెచ్చిపెట్టారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
కిట్లు పేరుతో గోల్‌మాల్!
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పేరుతో ఎంత గోల్‌మాల్ చేశారో తెలియదు గానీ విద్యార్థులకు ఇచ్చిన నాసిరకం కిట్‌లు అక్కరకు రాకుండా పోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్‌లు కొద్ది రోజులకే చిరిగిపోయాయి. జిప్పులు పాడైపోయాయి. భుజాలకు తగిలించుకునే బందులు సైతం ఊడిపోతున్నాయి. దీంతో ధాన్యం బస్తాను మోసినట్లు బ్యాగును భుజంపై మోసుకుంటూ రావాల్సిన దుస్థితి ఏర్పడింది. మూడంచెల తనిఖీ తర్వాత బ్యాగులు ఇస్తున్నామని చెప్పినా మూడు వారాలు కూడా మన్నిక రాకుండా చిరిగిపోయాయి. విద్యార్థుల సైజుతో సంబంధం లేకుండా కొందరికి బూట్లు ఇచ్చారు. మరికొందరికి నేటికీ ఇవ్వలేదు. ఒక్కో కిట్టుకు సుమారు రూ.2,300వరకు వెచ్చించినా నిరుపయోగమైన పరిస్థితి ఏర్పడింది.
లోకేష్ జమానాలో విద్యాశాఖ పరువు గంగపాలు
విద్యార్థులకు చిరిగిన బ్యాగులు, చాలని బూట్లు
డొక్కా సీతమ్మ పరువు తీసేలా మధ్యాహ్న భోజనం
ఉపాధ్యాయులకు అవే రకమైన ఇబ్బందులు


