రణస్థలం: లావేరు మండలంలోని బయ్యన్నపేట గ్రామంలో బుధవారం ‘నా సినిమాలో నటీనటులు మా ఊరి వాళ్లే’ అనే చిత్రం షూటింగ్ జరిగింది. హీరో, హీరోయిన్లగా భాను, మధుమిత నటిస్తున్నట్లు లావేరు మండలంలోని బడుమూరు గ్రామానికి చెందిన చిత్ర దర్శకుడు సతీష్ పీసా తెలిపారు. కొద్ది రోజులుగా అరిణాం అక్కివలసలో షూటింగ్ జరుపుతున్నామన్నారు. కలిగ గణేష్ యాదవ్, శాంతారామ్ చల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చిలకపాలెం, బుడుమూరు, రాజాం, రణస్థలం, శ్రీకాకుళం ప్రాంతాల్లో జరుగుతోందని వెల్లడించారు. సినిమాలో ప్రధాన నటులుగా చిత్రం శ్రీను, జబర్థస్త్ అప్పారావు, శకుంతలమ్మ, గీతం రాజు, గణేష్ యాదవ్, శాంతారామ్, కృష్ణారావు, రాజులమ్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్రం బృందం తెలియజేసింది.


