1,72,509
జిల్లాలో
శ్రీకాకుళం పాతబస్టాండ్:
ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగిసింది. కార్యక్రమం ఎన్నికల కమిషన్‌దే అయినా అధికార పార్టీ కనుసన్నల్లోనే సర్ సర్వస్వం సాగింది. చాలాచోట్ల బీఎల్‌ఓలను కాదని బీఎల్‌ఏలు పెద్దరికం చేసి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం యథాశక్తి చేశారు. టెక్కలి వంటి ప్రాంతాల్లో ఈ అక్రమాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. సర్ కార్యక్రమంలో ఇంటింటి సర్వే, డిజిలైజేషన్ వంటి కార్యక్రమాలు జూన్ 15 నుంచి ప్రారంభమై ఈనెల 24 తో ముగిశాయి. ఈ ప్రక్రియ అంతా అయోమయంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా అవకతవకలు జరిగాయి. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 1,72,509 ఓట్లను తొలగించినట్ల సమాచారం. ఎక్కువగా శ్రీకాకుళం నియోజకవర్గంలో తొలగింపులు 24,634 జరిగా యి. అలాగే తక్కువ సంఖ్యలో 15,173 ఓటర్లను ఆమదాలవలస నియోజకవర్గంలో తొలగించారు. అయితే ఈ సారి సర్‌లో ఎక్కువగా శాశ్వత వలసలు చూపించి 44,956 ఓట్లను తొలగించారు.
31న ముసాయిదా
జూన్ 15 నుంచి 40 రోజులు పాటు జరిగిన ఓటర్లు, ఇంటింట సర్వే, మ్యాపింగ్ ప్రక్రియ ముగి సింది. దీనిపై అభ్యంతరాలు, క్లయిమ్‌లు అందజేసేందుకు వచ్చేనెల 31 వరకు గడువు ఉంది. సె ప్టెంబర్ 28 నాటికి క్లెయిమ్‌లు అభ్యంతరాలు పరిశీలించి అక్టోబర్ 3న తుది జాబితా విడుదల చేయనున్నారు.
జిల్లాలో సర్‌కు ముందు
ఓటర్ల సంఖ్య 18,97,405
సర్‌లో తొలగించిన
ఓటర్ల సంఖ్య 1,72,509
ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 17,24,896
కారణం తొలగించిన
ఓటర్ల సంఖ్య
డెత్ 78,482
శాశ్వత వలసలు 4,956
వేరేచోట ఉన్న వారు 32,556
యూఈఎఫ్ తో దొరకనివారు 16,444
ఇతర కారణాలు 71
మొత్తం తొలగించిన ఓటర్లు 1,72,509
అత్యధికంగా శ్రీకాకుళం, అత్యల్పంగా ఆమదాలవలసలో ఓట్ల తొలగింపు
టెక్కలి తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు పట్టించుకోని వైనం
అధికార పార్టీ కనుసన్నల్లోనే ‘సర్’ ముగింపు
నియోజకవర్గాల వారీగా
తొలగించిన ఓటర్ల సంఖ్య
ఇచ్ఛాపురం 31,631
పలాస 20,602
టెక్కలి 20,879
పాతపట్నం 19,819
శ్రీకాకుళం 24,634
ఆమదాలవలస 15,173
ఎచ్చెర్ల 22,606
నరసన్నపేట 17,167
మొత్తం 1,72,509
నియోజకవర్గాల వారీ శాశ్వత వలస ఓటర్లు
ఇచ్ఛాపురం 5,211
పలాస 4,485
టెక్కలి 5,243
పాతపట్నం 3,237
శ్రీకాకుళం 4,930
ఆమదాలవలస 7,792
ఎచ్చెర్ల 8,591
నరసన్నపేట 5,467
మొత్తం 44,956


