పలాస కిడ్నీ ఆస్పత్రికి ఫిదా | - | Sakshi
Sakshi News home page

పలాస కిడ్నీ ఆస్పత్రికి ఫిదా

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన కిడ్నీ రీసె ర్చ్‌ కమ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని చూసి నీతి ఆయోగ్‌ వైద్య బృందం ఎగ్జైట్‌ అయ్యింది. జార్ఖండ్‌ తర్వాత ఇక్కడే అతి పెద్ద ఆస్పత్రి ఉందని అభిప్రాయపడింది. పెద్ద ఆస్పత్రి బిల్డింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఆకర్షితులై నీతి ఆయోగ్‌ వైద్య బృందం సెల్ఫీలు కూడా తీసుకోవడం విశేషం. అంతకుముందు ఆస్పత్రుల వైద్యులతో నీతి ఆయోగ్‌ వైద్య బృందం సమీక్షించింది. సమీక్షలో వైద్యుల కొరత ఉందని గుర్తించి యంగ్‌ డాక్టర్లను ఫిఫ్టుల వారీగా పనిచేసే లా చర్యలు తీసుకుంటామన్నారు. నీతి ఆయోగ్‌ నుంచి నిధులు తెచ్చి రీసెర్చ్‌ పెంచుతామన్నారు. డయాలసిస్‌తో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కూడా చేసుకోవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశీలనలో నీతి ఆయోగ్‌ డాక్టర్‌ శ్రీని వాసరావు, హైదరాబాద్‌ నిమ్స్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ భూషణం, ఢిల్లీ ఎయిమ్స్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ బౌమిన్‌, ఎయిమ్స్‌ నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ దీ పాంకర్‌, డాక్టర్‌ రాజు, డీఎంహెచ్‌ఓ శ్రీకాంత్‌, డీసీహెచ్‌ఎస్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

‘రోగులకు నమ్మకం కలగాలి’

సోంపేట: కిడ్నీ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని నీతిఅయోగ్‌ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు వైద్యులకు సూచించారు. ఆదివారం సోంపేట సామాజిక ఆస్పత్రి, డయాలసిస్‌ కేంద్రాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుల బృందం పరిశీలించింది. స్థానిక వైద్యులు మాట్లాడుతూ వసతులు పెంచి మందులు ఉంచాలని సూచించారు.

కవిటి: బల్లిపుట్టుగలో నీతి ఆయోగ్‌ మెంబర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు బృందం పర్యటించి బాధితులతో మాట్లాడారు. మృతుల గురించి ‘సాక్షి’లో కథ నం వెలువడింది. రెండు తరాల వారు పండించిన పంటలు, పంట సాగు విధానాలు, మంచినీరు తాగే తీరు, పెయిన్‌కిల్లర్లు తీసుకునే క్రమం తదితర అంశాల్ని తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement