శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మంగళవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కూడలి వైఎస్సార్ విగ్రహం నుంచి సూర్యమహల్ వివేకానంద విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలి పారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పార్టీ కార్యాల యంలో ముఖ్య నేతలు, విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మా ట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా చెల్లించకపోవడం, నిరుద్యోగ భృతి హామీని అమలు చేయకపోవడం వంటి ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తుతామన్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం జరిగే ఈ నిరసన ర్యాలీని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేస్తామని, యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పెనుబర్తి సురేష్ బాబు, సీఈసీ సభ్యులు, నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూరిబాబు, యువజన విభా గం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, రాష్ట్రకార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అద్యక్షులు అంబటి శ్రీనివాస్, ఎంపీపీలు గొండు రఘురాం, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు పిన్నింటి సాయి, చల్ల రవికుమార్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గుండ హరీష్, దండి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


