‘ఆలయ నిర్మాణం అడ్డుకోవడం తగదు’ | - | Sakshi
Sakshi News home page

‘ఆలయ నిర్మాణం అడ్డుకోవడం తగదు’

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

‘ఆలయ నిర్మాణం అడ్డుకోవడం తగదు’

ఆమదాలవలస: గ్రామస్తులమంతా కలిసి ఆంజనేయస్వామి ఆలయం నిర్మాణం చేస్తుంటే అడ్డుకోవడం తగదని ఆమదాలవలస మున్సిపాలిటీ తిమ్మాపురం గ్రామస్తులు ఆదివారం రహదారిపై ఆందోళన చేశారు. గ్రామ శివార్లలో పాలకొండ రోడ్డు పక్కన, తిమ్మాపురం గ్రామం వెళ్లే రహదారి శివార్లలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు చర్య లు చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న మున్సిపల్‌ అధికారులు, రహదారి పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారు. దీనికి గ్రామస్తులంతా కలిసి ఆందోళన చేసి రహదారికి దూరంగా ఉందని, ఎవరికీ ఆటంకం లేకుండా నిర్మాణాలు చేపడతామని మున్సిపల్‌ కమిషనర్‌ తమ్మినేని రవికి విన్నవించారు. ఆయన అక్కడకు పరిశీలనకు వెళ్తే ఆయననూ నిలదీశారు. దీనికి స్పందించి కమిషనర్‌ తదుపరి నిర్ణం చెప్పినవరకు నిర్మాణాలు ఆపాలని అక్కడ నుంచి వచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement