28న విద్యార్థి, యువత ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

28న విద్యార్థి, యువత ర్యాలీ

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

28న విద్యార్థి, యువత ర్యాలీ ● పోస్టర్‌ ఆవిష్కరించిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

● పోస్టర్‌ ఆవిష్కరించిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

పోలాకి: జిల్లా కేంద్రంలో ఈ నెల 28వ తేదీన వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువత ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ కోరా రు. నీట్‌ స్కామ్‌, డీఎస్సీలో అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులో జాప్యం, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లింపు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయటమే లక్ష్యంగా ర్యాలీ జరగనుందని కృష్ణదాస్‌ అన్నారు. ర్యాలీకి సంబంధించి పోస్టర్‌ను పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకుల సమక్షంలో విడుదల చేశారు. రాష్ట్రంలో కూటమి పాలన ఆరంభం నుంచి ప్రకటనలకే పరిమితమై యువతకు ఉపాధి లేకుండా, పరిశ్రమలు కాగితాలపై చూపించి కాలయాపన చేయటాన్ని ర్యాలీలో పాల్గొని ఖండించా లని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌ కోరారు. కార్యక్రమంలో పార్టీ యువజన, విధ్యార్ధి విభాగం నాయకులు దండి జయప్రకాశ్‌, గుండ హరీష్‌, పాగోటి భరత్‌, ముద్దాడ గోవింద, కనపల అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

‘నారా లోకేష్‌ రాజీనామా చేయాలి’

రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. నీట్‌ పరీక్షాపత్రం లీకేజ్‌ వివాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్లే, అదే ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సైతం డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement