సీదిరి అరెస్టు కక్షసాధింపు చర్య | - | Sakshi
Sakshi News home page

సీదిరి అరెస్టు కక్షసాధింపు చర్య

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

సీదిరి అరెస్టు కక్షసాధింపు చర్య

పలాస : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజ యరావు అన్నారు. శనివారం అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జి.ఎం.ఇ కాలనీలోని పార్టీ కార్యాలయం ప్రగతి భవనంలో విలేకరులతో రెడ్డి శాంతి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాన్ని హత్యానేరంగా నమోదు చేయడం ఇదే మొదటిశారన్నారు. అరెస్టయిన నాటి నుంచి కుటుంబసభ్యులు కనీసం భోజనం చేయకుండా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని, వారు ఏం తప్పు చేశారని ఇంతటి కక్షకు ఒడిగట్టారని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై ప్రతీకార చర్యలు నిత్యకృత్యంగా మారాయని, అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అనంత రం పలాస నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు మాట్లాడుతూ తప్పుడు ఆరోప ణలతో సీదిరిని అరెస్ట్‌ చేయడం దుర్మార్గమైన చర్య గా అభివర్ణించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల తో సీదిరి కుటుంబం ఎంతగానో ఇబ్బందిపడుతోందని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న నాయకుల పై ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనన్నారు. అరెస్టును సరైన పద్ధతిలోనే చేశామని భావిస్తే పాలకులు వెంటనే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, ప్రజలే తీర్పు ఇస్తారని చెప్పారు. ఈ ఘటన లో మృతి చెందిన దానయ్య కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పలాస కాశీబు గ్గ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిష్ఠు గోపి, జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు, పలాస కాశీబుగ్గ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బోర కృష్ణారావు, జిల్లా నాయకులు ఉంగ సాయికృష్ణ, చిట్టిబాబు, చంద్రకళ, సుజాత పండా, లక్ష్మణ్‌, దుర్గా శంకర్‌ పండా, జోగారావు, ధనరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement