శ్రీకాకుళం
ఎమ్మెల్యే కూన రవి ఆక్రమణలపై రైతుల పోరు
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026
నిజాలు బయట పడనీయకుండా నిర్బంధిస్తేనేం.. నినాదాలు నిజాలను వినిపించాయి. అక్రమాలు బయట పడకుండా ఆంక్షలు పెడితేనేం.. పాలకుల భయాలు ప్రస్ఫుటంగా తెలిసిపోయాయి. ఆక్రమణలు వెలుగు చూడకుండా అణచివేయాలని చూస్తేనేం.. విపక్ష నేత వెలిగించిన చైతన్య కాగడాలు చీకటి బాగోతాన్ని బట్టబయలు చేశాయి. జిల్లాలో కూటమి నేతల నిర్బంధ రచన కొనసాగుతూనే ఉంది. ఈసారి ఆమదాలవలస దీనికి వేదికై ంది. స్థానిక ఎమ్మెల్యే ఆక్రమణలు బయట పెడదామని రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేత చింతాడ ముందడుగు వేస్తే.. పోలీసుల సాయంతో దాన్ని అడ్డుకున్నారు.
ఆమదాలవలస :
పోలీసులను అడ్డం పెట్టుకుని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తన అక్రమాలను బయట పడనీయకుండా ఆపుకుంటున్నారని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాల ని ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. మండలంలోని తోటాడ రెవెన్యూ పరిధి కొత్తరోడ్డు వద్ద నారాయణపురం ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న మిర్తిబట్టిపై ఆమదాలవలస ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, దిగువ ఉన్న రైతులకు నీరందకుండా, ఎగువ పొలాలు ముంపునకు గురయ్యేలా చేస్తున్నా రని చింతాడ ఆరోపించారు. ఆ ప్రాంత రైతులతో కలిసి ఆ నిర్మాణాలను అడ్డుకునేందుకు శుక్రవారం వెళ్తుండగా ఆయనను ఉదయం నుంచి రావికంటిపేటలోని తన ఇంటి నుంచి బయటకు రాకుండా ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ సన పల బాలరాజు పోలీసు బలగాలతో హౌస్ అరెస్టు చేశారు. పార్టీ శ్రేణులు అక్కడకు రావడంతో రావి కంటిపేట దద్దరిల్లిపోయింది. పోలీసులను పర్మిష న్ అడిగినా ఇవ్వలేదు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద కూడా చింతాడను ముందుకు వెళ్లనీయకుండా నిలువరించారు.
ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మాట్లాడుతూ కూన రవికుమార్ డమాబుస్ మాటలు ప్ర జలకు తెలుసని అన్నారు. ఆమదాలవలసలో ఆయన చేసిన భూదందాలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని తెలిపారు. త్వరలోనే కూన అక్రమాలకు చెక్ పెడతామన్నారు. కూన ఈ నియోజకవర్గానికి పట్టిన దరిద్రమని, ఇసుక అక్రమ రవాణా, భూదందాల్లో రాష్ట్రంలో అగ్రస్థానం పొందిన వ్యక్తి కూన అని గుర్తు చేశారు. గతంలో సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో సుమారు 99 ఎకరాలు ఆయన పేరు మీద, ఆయన సతీమణి పేరు మీద రాయించుకుని కాజేయాలని చూశాడని పేర్కొన్నా రు. దానికి అప్పుడు అడ్డకట్ట వేశామని అన్నారు. అలాగే కోటిపల్లిలో భూములు కాజేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆమదాలవలస మండలం వెంకయ్యపేట, సరుబుజ్జిలి మండలం రొట్టవలస తదితర ప్రాంతాల్లో ఉన్న ఇనాం భూములపై కూన రవికుమార్ కన్నేశారని తెలిపారు.
ప్రస్తుతం కూన మాటలు నియోజకవర్గం ప్రజలు ఎవరూ నమ్మే విధంగా లేవన్నారు. అక్రమ అరెస్టులతో నిజానిజాలు ఆపలేరని, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పార్టీ ముఖ్య నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, దుంపల శ్యామలరావు, పొన్నాడ చిన్నారావు, బెండి తులసీరావు, తేజేశ్వరరావు, బెండి శ్రీను, బెండి గిరిబాబు, సురవరపు నాగేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, పొడుగు శ్రీనువాసరావు, చింతాడ వెంకట సత్యప్రసాద్, బెవర మల్లేశ్వరరావు, మురళి, పొదిలాపు తిరపతిరావు, సంజయ్, యువకులు, పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని కూన ప్రయత్నించారు
కాలువ గట్లు, సాగునీటి కాలువలు కూడా వదల్లేదు
భూ ఆక్రమణలు, ఇసుక అక్రమ వ్యాపారానికి కేరాఫ్ కూన
దుమ్మెత్తిపోసిన వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి
కూన ఆక్రమణలు చూపేందుకు వెళ్తున్న
చింతాడ రవికుమార్‌ను అడ్డుకున్న పోలీసులు


