సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్టుపై మత్స్యకారులు రగిలిపోతున్నారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యా నేరంగా చిత్రీకరించడంపై భగ్గుమంటున్నారు. మత్స్యకార సామాజిక వర్గంలో ఎదిగిన నాయకులను కక్ష సాఽధింపు రాజకీయాలకు బలిచేయడంపై మండి పడుతున్నారు. జిల్లాలో తమ సా మాజిక వర్గం నుంచి ఎదిగి, మంత్రిగా పని చేసిన సీదిరి అప్పలరాజును అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగిన కుట్రలు, కక్ష సాధింపు చర్యలను తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న మత్స్యకారుల ఇంటింటికీ వెళ్లి చెప్పాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా సమావేశాలు పెట్టుకుని, తీర్మానాలు చేసుకుంటున్నారు.
సమస్యలతో సతమతం..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ప్రభుత్వంలో ఇచ్చిన మత్స్యకార భరోసా పథ కం స్థానంలో మత్స్యకార సేవలో కార్య క్రమాన్ని కోతలు పెట్టారు. అనేక మంది సాయానికి నోచుకోలేకపోయారు. వేట విరామం సమయంలో ఇవ్వాల్సిన భృతిని కూ డా సకాలంలో ఇవ్వడం లేదు. దీనికి తోడు మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన బుడగట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ పనులు, నువ్వులరేవు జెట్టీ పనులను నిలిపేశారు. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతవుతున్న మత్స్యకారులను కాపాడేందుకు సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో జరుగుతున్న మరణాలు కలిచి వేస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుండి తగిన సహాయం, త్వరితగతిన గాలింపు చర్యలు, తప్పనిసరి ప్రమాద బీమా సౌకర్యం కల్పించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదిగే పరిస్థితులు ఉండటం లేదు. ఒకరిద్దరు ఎదిగినా వారిని రాజకీయ కక్ష సాధింపులతో అణగదొక్కుతున్నారు. జిల్లాలో టీడీపీ నుంచి ఇంతవరకు మత్స్యకారుల నుంచి ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ అయిన దాఖలాల్లేవు. ఆ అవకాశాన్ని గతంలో వైఎస్సార్ హయాంలో, తర్వాత వైఎస్ జగన్ హయాంలోనే వచ్చింది.
ప్రశ్నిస్తున్నారనేనా..?
మత్స్యకార సామాజిక వర్గంలో వైద్యుడిగా సేవలందించి, బలమైన వ్యక్తిగా ఎదిగిన సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా చేయడంతో పాటు మంత్రిగా గౌరవించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కింది. ఉద్దానం బిడ్డగా కిడ్నీ రోగుల కోసం రీసెర్చ్ కమ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, తాగు నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని రూ.700కోట్లతో వంశధార జలాలను సమగ్ర రక్షిత నీటి పథకం కింద ఉద్దానం ప్రాంతానికి అందించిన ఘనత కూడా వైఎస్ జగన్ ద్వారా సీదిరి అప్పలరాజుకు దక్కింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలపైన, ప్రభుత్వ వైఫల్యాలపైన గట్టిగా స్వరం వినిపించడమే కాకుండా ప్రజా ఆందోళనలు చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేక అణచివేయాలని అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా పలు కేసులు పెట్టి, ఎన్నో సార్లు జైలు కు పంపించాలని చూశారు. కానీ కుదర లేదు. ఇప్పుడు తన కుమారుడు బైక్ యాక్సిడెంట్‌ను ఉద్దేశపూర్వకంగా హత్యా నేరంగా చిత్రీకరిస్తూ అక్రమ కేసులు పెట్టి తండ్రీ కొడుకులు ఇద్దర్ని అరెస్టు చేసి, జైలుకు పంపించారు. తమ నాయకుడిపై జరిగిన కుట్రలు, జరిగిన అన్యాయంపై మత్స్యకారులంతా ఏకమవుతున్నారు. గార మండలం కె.మత్స్యలేశం, బందరువానిపేట, వత్సవలస, కొమరవానిపేట మత్స్యకారులు, గుప్పెడు పేటలో పోలాకి మండలం మత్స్యకారులు సమావేశమై ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తడమే కాకుండా పలు తీర్మానాలు చేసుకున్నా రు. టీడీపీ పాలకులు అనుసరిస్తున్న అణిచి వేత ధోరణిని ఇంటింటికీ వెళ్లి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
తమ నాయకుడిని అన్యాయంగా జైలుకు పంపించారని మనస్తాపం
టీడీపీ నేతల కుట్రలపై సర్వత్రా ధ్వజం
సీదిరిని వేధించడంపై భగ్గుమంటున్న మత్స్యకార సామాజిక వర్గం
మత్స్యకారుల ఇంటింటికీ వెళ్లి
అన్యాయాన్ని వివరించాలని నిర్ణయం


