రసనలు.. | - | Sakshi
Sakshi News home page

రసనలు..

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

లదీతలు
మెగా పీటీఎంలో అధికారులపై ప్రశ్నల వర్షం

తల్లికి వందనం ఎందుకు పడలేదని పలువురు ఆగ్రహం

మెనూ, సన్నబియ్యం, యూనిఫాంపై నిలదీత

శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ నిలదీతల మధ్య సాగింది. ముఖ్యంగా తల్లికి వందనం నిధులు చాలామందికి జమ కాకపోవడంతో వారంతా పాఠశాలలకు వచ్చి అధికారులను, ఉపాధ్యాయులను నిలదీశారు. సరు బుజ్జిలి మండలం కాగితాపల్లి ప్రాథమిక పాఠశాలలో ముగ్గురికి, ఉన్నత పాఠశాలలో ఇద్దరికీ తల్లికి వందనం నిధులు జమకాలేదు. దీంతో సమావేశం ప్రారంభమైన వెంటనే తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరకొర నిధులు..

సమావేశానికి తల్లితో పాటు తండ్రి కూడా తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పిన ప్రభుత్వం వారికి భోజనాలు పెట్టేందుకు అవసరమైనంత మేరకు నిధులు విడుదల చేయలేదు. వంద మంది విద్యార్థులు ఉండే పాఠశాలకు రూ.2200 కేటాయించడం, అది కూడా విడుదల చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఆమదాలవలస మునిసిపల్‌ హైస్కూల్‌, కాశీబుగ్గ జిల్లా పరిషత్‌ హైస్కూల్లో భోజనాలు పెట్టలేదు. ఆమదాలవలసలో అక్షయపాత్ర సరఫరా చేసే భోజనం సకాలంలో రాకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు.

సన్నబియ్యం లేకుండా భోజనమా..

ఆమదాలవలస, నరసన్నపేట మండలాల్లో సన్నబియ్యంపై నిలదీతలు ఎదురయ్యాయి. యూనిఫారాలు, సిలబస్‌పైనా కొందరు ప్రశ్నించారు.

విద్యా వ్యవస్థ అభివృద్ధికి చర్యలు

టెక్కలి: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం యలమంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, డీఈఓ కె.రవిబాబు, ఏపీసీ వేణుగోపాల్‌, ప్రత్యేకాధికారి గడ్డెమ్మ, నాయకులు కె.హరివరప్రసాద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆర్‌టీసీ అధికారుల తీరుపై మండిపాటు

కవిటి: ప్రభుత్వం నిబంధనల మేరకు బస్‌పాస్‌ తీసుకున్నప్పటికీ తమ పిల్లల్ని బడివరకూ చేరవేయకుండా చాలా దూరంలో ఆపేసి నడిరోడ్డుపై వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కవిటి మండలం ఇద్దువానిపాలెంకు చెందిన ఓ మాతృమూర్తి శుక్రవారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రు ల సమావేశంలో నిలదీసింది. దీనిపై బొరివంక ఆదర్శ పాఠశాల హెచ్‌ఎం రఘునా థ్‌ పాణిగ్రాహి స్పందిస్తూ ఈ అంశంపై సిబ్బందితో మాట్లాడినా తమ పట్ల కూడా దురుసుగా వ్యవహరించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement