పాలన ఎలా మరి? | - | Sakshi
Sakshi News home page

పాలన ఎలా మరి?

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

● కుట్రలతోనే సరి..

మందులు అందక కిడ్నీ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.. పాలకులేమో ప్రత్యర్థులపై కక్ష సాధించడంలో బిజీగా ఉన్నారు. ఎరువులు అందక రైతులు అల్లాడిపోతున్నారు.. నేతలు వైరి పక్ష నేతలను వేధించడంపైనే దృష్టి పెడుతున్నారు. సాగునీరు అందక పొలాలు బీడువారుతున్నాయి.. ప్రజా ప్రతినిధులకు ‘రాజకీయం’ చేయడంతోనే సమయం సరిపోతోంది. జిల్లాలో నెలకొన్న వింత పరిస్థితులివి. సవాలక్ష సమస్యలు ప్రజలను వేధిస్తుంటే కక్ష సాధించడమే తమ పని అన్నట్టు పాలకులు వ్యవహరిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదం ఘటనను హత్యా నేరంగా మార్చేశారు. ఆ ప్రమాద ఘటనలో సీదిరి అప్పలరాజు లేకపోయినప్పటికీ నేర పూరిత కేసును పెట్టి, అనుకున్న ప్లాన్‌ ప్రకారం జైలు కు పంపించారు. అప్పలరాజును లక్ష్యంగా చేసుకుని ఎత్తుగడలు వేయడంలోనే పాలకులు నిమగ్నమ య్యారు. కానీ జిల్లాలో సాగునీరు అందడం లేదని, ఎరువులు సరిపోవడం లేదని, కిడ్నీ మందులు లేవనే విషయాలనే పట్టించుకోవడం లేదు. పెదబాబు, చినబాబు దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు మాజీ మంత్రిని ఎలా జైలుకు పంపించాలన్నదానిపై దృష్టి పెట్టారు గానీ ప్రజల సమస్యలు, ఇతరుల బాధలు వారికి కనిపించడం లేదు.

ఇవెందుకు కనిపించవు

మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలం పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రం వద్దకు ఎరువు కోసం వెళ్లిన కాంతమ్మ అనే మహిళ మృతి చెందారు. ఆ ఘటనను ప్రభుత్వం పట్టించుకోలేదు. పాలకులకు కనీసం పట్టలేదు. సరికదా లేని అనారోగ్యాన్ని కాంతమ్మకు అంటగట్టి, నిజాన్ని చంపేశారు.

మందస టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో ఢీకొనడంతో పలాస నియోజకవర్గం మందస మండలంలోని లోహరిబందకు చెందిన నర్తు వెంకటరమణ మృతిచెందారు. మృతుని భార్య హార్ట్‌ షేషెంట్‌,ఇద్దరు పిల్లలు, తనపై ఆధారపడి తల్లి ఉన్నారు. రోడ్డున పడ్డ ఆ కుటుంబాన్ని కనీసం ప ట్టించుకోలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకోలేదు.

ఉద్దానంలో కిడ్నీ రోగులకు మందులు అందడం లేదు. తాజాగా ఒకే రోజు ముగ్గురు రోగులు మృతి చెందారు. దీనిపై దృష్టి పెట్టలేదు.

విద్యార్థులకు ఇవ్వాల్సిన కిట్లు పంపిణీ చేయకపోవడంతో పిల్లలు సతమతమవుతున్నారు.

గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దుకాణాల్లోనే మద్యం ఎక్కువ ధరకు విక్రయించి, మందుబాబులను దోచేస్తున్నారు.

జిల్లాలో చాలా చోట్ల రైతులకు ఇచ్చిన విత్తనాలు మొలకెత్తడం లేదు.

సాగునీరు అందక మడులు ఎండిపోతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలతో రోడ్లు శిథిలమై ప్రమాదాలు జరుగుతున్నాయి.

తాగునీటి కోసం జనం రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగులు సైతం ఆందోళనకు దిగుతున్నారు.

జిల్లాకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీని వాస్‌కు గాని, మంత్రి పార్థసారథికి గాని, జిల్లా మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్‌ నా యుడుకు ఇవేవీ పట్టడం లేదు. ప్రజలు ఎదుర్కొంటు న్న ఇబ్బందులు కంటే మాజీ మంత్రి సీదిరి అప్పలరా జు కుమారుడు బైక్‌ యాక్సిడెంటే ప్రధానమైపోయింది.

ఎరువుల్లేక అల్లాడిపోతున్న రైతులు

సాగునీరు అందక ఎండుతున్న పొలాలు

మందుల్లేక చనిపోతున్న కిడ్నీ వ్యాధి బాధితులు

జిల్లా పాలకుల దృష్టంతా కక్ష సాధింపుపైనే

సీదిరిని జైలుకు పంపడమే లక్ష్యంగా పాలన

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement