పేరాడ తిలక్‌ నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

పేరాడ తిలక్‌ నిర్బంధం

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

మెళియాపుట్టి, సారవకోట: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో పలాస పోలీస్‌స్టేషన్‌కు వైఎస్సార్‌ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌ వెళ్లడంతో ఆయనను బుధవారం అర్ధరాత్రి మెళియాపుట్టి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ గురువారం మెళియాపుట్టి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. కానీ ఆయనను స్టేషన్‌ లోపలకు అనుమతించలేదు. ఇక్కడే దీక్షకు దిగుతానని కృష్ణదాస్‌ చెప్పగా.. ఆయన ఒక్కరినే విడిచి పెట్టారు. అనంతరం టెక్కలి నియోజక వర్గ నాయకురాలు దువ్వాడ వాణిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. టెక్కలి, నందిగాం, మెళియాపుట్టి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు భారీ ఎత్తున స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పార్టీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, ముఖ్యనేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు సారవకోటలో ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు రహదారిపై ఆందోళనకు దిగారు.

అక్రమ నిర్భంధాలు సరికాదు: పేరాడ తిలక్‌

గౌరవప్రదమైన డాక్టర్‌ వృత్తిలో ఉండే వ్యక్తి, మాజీ మంత్రిని అక్రమంగా అరెస్టు చేస్తే వెళ్లి సంఘీభావం తెలపడం తప్పా అని వైఎస్సార్‌ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌ ప్రశ్నించారు. ఆయనను గురువారం సాయంత్రం మెళియాపుట్టి పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడిచిపెట్టారు. అర్ధరాత్రి మెడపై చేతులు వేసుకుని, కారెక్కించి, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా.. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, మందులు వేసుకోవ డానికి కూడా అవకాశం ఇవ్వకుండా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడం బాధాకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement