అడంగల్ గ్యాప్‌లు నమోదు చేయడం నుంచి ఫైనల్ ఎంట్రీల వరకు రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా లక్ష్యాలు పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్‌లో ఏవైనా కోర్టు కేసులు, చట్టపరమైన వివాదాలు వస్తే బాధ్యత మాత్రం విలేజ్ సర్వేయర్లపైనే నెట్టే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి పూట చేస్తున్న లాగిన్ పనులను కలెక్టర్, జేసీకి
తెలిసేలా రాత్రి 11.01గంటలకు అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన స్క్రీన్‌షాట్


